వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని.. | Man Arrested Cheated Young Woman In East Godavari | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని..

Nov 6 2022 7:57 AM | Updated on Nov 6 2022 8:15 AM

Man Arrested Cheated Young Woman In East Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొవ్వూరు(తూర్పుగోదావరి): నమ్మించి, ఓ యువతిని మోసగించిన అభియోగంపై రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్‌కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, సమీపంలోని స్టూడియోలో ప్రేమ్‌కుమార్‌ పనిచేసేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటూనంటూ ప్రేమ్‌కుమార్‌ ఆమెను నమ్మించి, తన అవసరం తీర్చుకున్నాక  మొహం చాటే శాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement