
గోకవరం(తూర్పుగోదావరి): ప్రేమ పేరుతో యువతిని మోసగించిన యువకుడిపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని గుమ్మళ్లదొడ్డికి చెందిన 17 ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన సూరంపూడి విజయ్‌కుమార్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి, నమ్మించి కొంతకాలం లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ముఖం చాటేశాడు.
దీనిపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.చెన్నారావు తెలిపారు. సంఘటనపై రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మంగళవారం గ్రామంలో విచారణ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment