ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే | Young Man Assassination Due To Extramarital Affair In Prakasam District | Sakshi
Sakshi News home page

ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే

Published Sun, Mar 6 2022 6:14 PM | Last Updated on Sun, Mar 6 2022 9:31 PM

Young Man Assassination Due To Extramarital Affair In Prakasam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మండలంలోని చిన్న ఓబినేనిపల్లెలో యువకుడి హత్య జరిగినట్లు మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొడ్డి శ్రీనివాసరెడ్డి తన పొలంలోకి కూలి పనులకు వచ్చే ఓ వివాహితతో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే మహిళతో ఎనిమిది నెలల నుంచి గోపు శ్రీనాథరెడ్డి అనే వ్యక్తి కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

చదవండి: పిల్లలతో పుట్టింటికి వచ్చి.. ఇంతలో ఏమైందో కానీ..

పొలం పనులకు వెళ్లినప్పుడు ఆమెకు ఖర్చులకు నగదు ఇస్తూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ తన వద్దకు రాకుండా శ్రీనాథరెడ్డి అడ్డుకుంటున్నాడని అతడిపై శ్రీనివాసరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం సమయంలో శ్రీనాథరెడ్డి మొక్కజొన్న పొలంలో నీరు పెట్టుకుంటుండగా శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్లాడు. మాటల్లో పెట్టి పొలంలో ముందు వైపున నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనాథరెడ్డి తలపై రంపపు కొడవలితో దాడి చేశాడు. కిందపడిపోయిన వెంటనే గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించినందుకు ఎస్పీ మలికాగర్గ్‌ అభినందనలు తెలిపారన్నారు. గిద్దలూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్‌ఐ మాధవరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement