వైరల్‌ వీడియో: అసలు నిజం ఇదే.. | Scenes Of Assault On Young Man Viral On Social Media | Sakshi

వైరల్‌ వీడియో: అసలు నిజం ఇదే..

Nov 17 2020 5:06 PM | Updated on Nov 17 2020 7:09 PM

Scenes Of Assault On Young Man Viral On Social Media - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలో యువకుడి పై దాడి కేసు ఘటనపై రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి, టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. మీడియాలో వచ్చిన రెండు దృశ్యాలు ఇప్పటివి కావని, అందులో ఒకటి గత ఏడాది నవంబర్ నెలలో మార్కెట్ సెంటర్‌లో జరిగిందన్నారు. రెండో ఘటన ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగినట్టు వివరాలు సేకరించామని పేర్కొన్నారు. యువకుడిని చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. శ్రీకాంత్ అనే వ్యక్తి కారు తీసుకొన్న యుగంధర్ అనే యువకుడు డ్యామేజీ చేశాడని, డ్యామేజీ ఖర్చులు చెల్లించని ఆ యువకుడిపై రాజశేఖర్‌ అనే మరో యువకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడని పేర్కొన్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement