
రాజేష్ (ఫైల్)
అనంతపురం క్రైం: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్‌కు చెందిన నల్లబోతుల రాజేష్ (33), సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. సుందరయ్య కాలనీకి చెందిన గురుమూర్తి, బాలరాజు... రాజేష్‌కు స్నేహితులు. గురుమూర్తి ఇంటి నిర్మాణ పనులను రాజేష్ పూర్తి చేయించాడు. ఆ సమయంలోనే గురుమూర్తి భార్య, రాజేష్ మధ్య చనువు పెరిగింది. ఈ విషయంగా రెండు నెలల క్రితం రాజేష్‌తో గురుమూర్తి గొడవపడ్డాడు.
చదవండి: పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి..
రాజేష్‌లో మార్పు రాకపోవడంతో కడతేర్చాలని భావించాడు. శుక్రవారం (ఈ నెల 17న) సాయంత్రం రాజేష్‌ను ఇంటి వద్ద నుంచి బాలరాజు, గురుమూర్తి కలిసి ద్విచక్ర వాహనంపై పిలుచుకెళ్లారు. చీకటి పడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో సుజాత ఫోన్ చేసింది. తామంతా మందు పార్టీలో ఉన్నామని, త్వరగా ముగించుకుని వస్తానని రాజేష్ తెలిపాడు. రాత్రంతా అతను ఇంటికి చేరుకోలేదు.
శనివారం ఉదయం కామారుపల్లి సమీపంలోని లే అవుట్‌లో వ్యక్తిని చంపి పడేశారన్న అందిన సమాచారం మేరకు ఇటుకలపల్లి సీఐ విజయభాస్కరగౌడ్, రూరల్ ఎస్‌ఐ మహానంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మెడపై కొడవలితో నరికినట్లుగా గాయాలున్నాయి. విషయం తెలుసుకున్న సుజాత అక్కడకు చేరుకుని మృతదేహం రాజేష్‌దేనని ధ్రువీకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment