
అరవైలలోనూ... ఇరవైల అందం సాధ్యమే!
అందాన్ని చాలాకాలం పాటు పదిలంగా కాపాడుకునే విషయంలో సెలబ్రిటీలను చూస్తుంటే అబ్బురంగా ఉంటుంది.
అందాన్ని చాలాకాలం పాటు పదిలంగా కాపాడుకునే విషయంలో సెలబ్రిటీలను చూస్తుంటే అబ్బురంగా ఉంటుంది. వాళ్లలో చాలామంది ఐదు పదుల వయసు దాటినవారే అయినా... పైలా పచ్చీస్‌గా చాలా యంగ్‌గా కనిపిస్తుంటారు. అదే వయసులో ఉన్న మన ఊళ్లలోని వారిని చూస్తే వయసు పైబడినట్లుగా ఉంటారు. మనమూ యంగ్‌గా ఉండటం సాధ్యం కాదా? - ఐశ్వర్య, నిజామాబాద్
అందం మీద ఇప్పుడు మన సమాజంలో అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో అందరూ అత్యుత్తమమైన లైఫ్ స్టైల్ క్లినిక్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. ఇవి కేవలం లుక్స్‌కు మాత్రమే కాదు... ఆరోగ్యానికీ సమానంగా ప్రాధాన్యం ఇస్తాయి. ఫలితంగా మీరు చూడ్డానికి బాగుండటం మాత్రమే కాదు... ఆరోగ్యంగానూ ఉంటారు. బీజీబిజీగా ఉండే సెలబ్రిటీస్, ప్రొఫెషనల్స్, మోడల్స్ లాంటి ప్రముఖులకు అందాన్నీ, ఆరోగ్యాన్నీ సమపాళ్లలో మేళవించి అందించడానికి ‘లీ గార్జస్’ ఏర్పాటైంది. అయితే కేవలం వారికి మాత్రమేగాక సామాన్యులకూ, సాధారణ ప్రజలకూ అదే స్థాయి, అదే ప్రమాణాలతో సేవలందించనుంది లీ గార్జస్.
ఇక్కడ అందం, ఆరోగ్యం సమపాళ్లలో అందేలా కాస్మటాలజీ చికిత్స జరుగుతుంది. ఇక్కడి చికిత్సల కోసం ఖరీదైన లేజర్ మెషిన్లు, వరల్డ్ క్లాస్ ఎక్విప్‌మెంట్, మరెన్నో రకాల అడ్వాన్స్‌డ్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. యూకే, యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్‌ల నుంచి తెచ్చిన అత్యాధునిక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. క్లయింట్‌ను చూసిన వెంటనే వారి వాస్తవమైన వయసు ఎంత, ముఖం ఎంత వయసును చూపిస్తోంది వంటి విషయాలను తెలుసుకుంటారు. ఇక సౌష్ఠవం విషయానికి వస్తే... బాడీ అనాలసిస్ ప్రక్రియ ద్వారా బరువు, కండరాలున్న తీరు, ఎముకల పటిష్టత వంటివి అంచనా వేస్తారు. బీఎమ్‌ఆర్, విటమిన్లు, మినరల్స్, ఫాట్ డిస్ట్రిబ్యూషన్ లాంటి పలు అంశాలను మెషిన్స్ సాయంతో అంచనా వేస్తారు.
ఒక చదరపు సెం.మీ. స్థలంలో ఉండాల్సిన వెంట్రుకలు ఎన్ని? కుదుళ్లు బలంగా ఉన్నాయా వంటి అంశాలను లెక్కవేస్తారు. ఇలా... అన్ని అంశాలనూ పూర్తిగా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒక పోతపోసిన విగ్రహంలాంటి శారీరక సౌష్ఠవం, అందం, ఆరోగ్యం ఉండేలా క్లెయింట్‌ను తీర్చిదిద్దడానికి యత్నిస్తారు. ఇలా కేవలం ఒక చోటే అందం కల్పించడం కాకుండా సంపూర్ణసౌందర్యం కోసం ప్రయత్నిస్తారు. ఉదాహరణకు వెంట్రుకలు రోజుకు 50 - 100కు పైగా రాలిపోతున్నాయంటే అది ఆందోళన కలిగించే అంశమే. కానీ ఇలా జుట్టురాలడాన్ని అరికట్టడానికి అవసరమైన అనేక అధునిక ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ‘‘మొదట అరామో పద్ధతిలో వెంట్రుక పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తాం. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ ఉపయోగిస్తాం. మీసోథెరపీ, స్టెమ్‌సెల్స్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్‌పీ) వంటివి ఈ ప్రక్రియలలో కొన్ని ముఖ్యమైనవి. ఈ చికిత్సలతో జుట్టు రాలుతుందన్న చింతను పూర్తిగా తొలగించుకోవచ్చు.
అలాగే మన మేని రంగు నిగారింపు కోసం కూడా అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. చర్మ కాంతిని పెంచడంలో గ్లుటాథియోన్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం వయసు, అనువంశికంగా వచ్చిన లక్షణాలు, మెడికల్, ఎన్విరాన్‌మెంటల్, లైఫ్‌స్టైల్ కండిషన్స్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్లుటాథియోన్ థెరపీని అందించాలి. ఇక విజియో మెషిన్... ముఖం మీద ఉన్న మచ్చలు, రంధ్రాలు, ముడుతలు, అతినీలలోహిత కిరణాల వల్ల కలిగిన డ్యామేజీ లాంటి అంశాలను విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణలను పరిగణనలోకి తీసుకొని చేసే గ్లుటాథియోన్ థెరపీ వల్ల కొంతమంది సెలబ్రిటీల్లాగే ఇప్పటి యువతీయువకుల్లోనూ వెలుగులీనే మేనితో మెరిసేలా చేయవచ్చు. ఈ ఆధునిక చికిత్సలన్నీ తాము ఏర్పాటు చేసిన ‘లీ గార్జస్’లో సాధ్యమవుతాయంటారు ఆ సంస్థకు చెందిన చీఫ్ కాస్మటాలజిస్ట్ డాక్టర్ సుమన్.
టెండనైటిస్ తగ్గుతుంది!
నా వయసు 24 ఏళ్లు. నేను బాస్కెట్‌బాల్ క్రీడలో ఎక్కువగా పాల్గొంటాను. కొంతకాలంగా చేతిని కదిలించినప్పుడల్లా నాకు భుజంలో విపరీతమైన నొప్పి ఉంటోంది. చేతిని పూర్తిగా పైకి ఎత్తలేకపోవడం, భుజం బిగువుగా ఉండటం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ గారిని సంప్రదిస్తే ఇది టెండనైటిస్ సమస్య వల్ల కావచ్చని అంటున్నారు. మందులు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్సతో ఇది పూర్తిగా నయం అవుతుందా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - యాదగిరిరావు, నల్లగొండ
మీరు తెలిపిన వివరాలను బట్టి ఇది టెండనైటిస్ సమస్యగా భావించవచ్చు. క్రీడలలో పాల్గొనేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. ఇవి సాగే గుణం కలిగి ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి కండరాలు ముడుచుకునే సమయంలో ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతైనా వీటికి హాని కలిగితే, ఆ అవయవభాగం కదలికలు ఇబ్బందికరంగా మారి, తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. టెండన్స్ ఇన్ఫెక్షన్‌కు గురికావడాన్ని టెండనైటిస్ అంటారు. సమస్య... భుజాలలో, మోచేతులు, మణికట్టు, బోటనవేలు మొదటి భాగం, తుంటి భాగం, మోకాలు, మడమల వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడుతుంది. ఏ వయసు వారినైనా ప్రభావితం చేసే ఈ సమస్య ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ. ఆ వయసులో టెండన్స్ సాగే తత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం ప్రధాన కారణం.
ఇతర కారణాలు: వయసు పెరగడం గాయం కావడం వృత్తిరీత్యా ఒకేరకమైన కదలికలు ఎక్కువగా కొనసాగించడం (ఉదా: కంప్యూటర్ కీబోర్డు, మౌస్ ఎక్కువగా ఉపయోగించడం, కార్పెంటరీ, పెయింటింగ్ మొదలైన కార్యకలాపాలు నిర్వహించడం) క్రీడలు డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఇది సంభవిస్తుంది. లక్షణాలు: టెండనెటిస్‌కి గురయ్యే ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడల్లా నొప్పి, వాపు, అక్కడ వేడిగా, ఎర్రగా మారడం వంటి లక్షణాలు గమనించవచ్చు కొన్ని సందర్భాల్లో బొబ్బ మాదిరిగా కూడా ఏర్పడవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కంప్యూటర్ కీబోర్డు, మౌస్‌లను సరైన పొజిషన్‌లో ఉంచి పనిచేసుకోవాలి పనిలో కొద్ది కొద్ది సేపటి తర్వాత కొంత విరామం తీసుకుంటూ ఉండాలి వ్యాయామాలు చేసే సమయంలో ఒకేసారి అధిక ఒత్తిడికి గురయ్యేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించాలి క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించాలి. చికిత్స: జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ విధానంలో రోగి మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం, రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా దాన్ని నయం చేయవచ్చు. అంతేకాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయవచ్చు.