కొత్తూరులో యువకుడి బలవన్మరణం | Kotturulo young balavanmaranam | Sakshi
Sakshi News home page

కొత్తూరులో యువకుడి బలవన్మరణం

Published Thu, Aug 25 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

Kotturulo young balavanmaranam

రాయపర్తి : ఓ యువకుడు చీరతో ఉరివేసుకొని బల వన్మరణానికి పాల్పడిన మండలంలోని కొత్తూరు లో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. కొత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ నాళ్లం శంకరయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడు ప్రవీన్‌(32) మార్కెటింగ్‌ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరంగల్‌లోని రంగశాయిపేటలో భార్యాపిల్లలతో నివాసముండే ప్రవీన్‌ బుధవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రవీన్‌ మరణానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి తల్లిదండ్రులతోపాటు, భార్య స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement