balavanmaranam
-
కొత్తూరులో యువకుడి బలవన్మరణం
రాయపర్తి : ఓ యువకుడు చీరతో ఉరివేసుకొని బల వన్మరణానికి పాల్పడిన మండలంలోని కొత్తూరు లో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. కొత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాళ్లం శంకరయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడు ప్రవీన్(32) మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరంగల్‌లోని రంగశాయిపేటలో భార్యాపిల్లలతో నివాసముండే ప్రవీన్ బుధవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రవీన్ మరణానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి తల్లిదండ్రులతోపాటు, భార్య స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం
మరిపెడ : మానసిక స్థితి బాగా లేక మండలంలోని బాబోజీగూడేనికి చెందిన భీమనపెల్లి రామ్మూర్తి(60) గ్రామం శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి కుటుంబం పదిసంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ రామ్మూర్తి కల్లుకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈనెల 19న హైదరాబాద్ నుంచి బాబోజీగూడేనికి చేరుకున్నాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న అనుమానంతో కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి గ్రామానికి వచ్చారు. ఈనెల 20న ఉదయం బయటికి వెళ్లిన రామ్మూర్తి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా గ్రామశివారులోని చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
యువరైతు బలవన్మరణం
ట్రాక్టర్ ఫైనాన్స్ కిస్తీ కట్టలేక, పంట అప్పులు తీర్చలేక.. సారపాక(బూర్గంపాడు) : సారపాక గ్రామ పంచాయతీలోని పాతసారపాకకు చెందిన యువరైతు కోటమర్తి విజయ్‌కుమార్(28) బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇతను ఐదేళ్లుగా ఆరెకరాల్లో పత్తి, వరి సాగుచేస్తున్నాడు. పంటలసాగు కోసం సుమారు రెండులక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయ పనుల కోసం ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ను కొనగా..కిస్తీ కట్టేందుకు డబ్బులు కరువయ్యాయి. గతంలో పాత ట్రాక్టర్ కొనేందుకు చేసిన అప్పులు కూడా తీరలేదు. పంట అప్పులు కట్టలేక, కిస్తీ డబ్బుల కోసం ట్రాక్టర్ ఫైనాన్స్ వారు వారం రోజుల నుంచి తిరుగుతుండడంతో..ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర మనోవ్యధతో గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి..భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వరి.. ఉరి తాడయ్యింది
- అప్పులు వెంటాడాయి.. - వెరసి.. యువరైతు బలవన్మరణం - జంగరాయి గ్రామంలో విషాదం చిన్నశంకరంపేట: ఎంతో ఆశతో సాగుకు ఉపక్రమించాడు.. వరినాట్లు వేశాడు.. అంతలోనే బోరులో నీళ్లు తగ్గాయి.. అప్పులు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు.. అటు పంట సైతం ఎండుముఖం పడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరగిపోవడంతో చేసేది లేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు,చిన్నశంకరంపేట ఎస్ఐ నగేష్ కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35)కు మూడున్నర ఎకరాల పొలం ఉంది. రెండెకరాల్లో వరినాట్లు వేశాడు. కొద్దిరోజులుగా బోరులో నీటి మట్టం తగ్గడం.. పంటకు నీళ్లు సరిగా అందకపోవడంతో ఎండుదశకు వచ్చింది. అప్పులు చేసి వరుసగా రెండు బోర్లు తవ్వించాడు.. అయినా చుక్కనీరు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఇటు పంట చేతికొచ్చే మార్గం లేక, అటు అప్పులు తీరే దారి కానరాక మనస్తాపం చెందాడు. స్థానిక బ్యాంకులో రూ.లక్షతో పాటు ప్రైవేట్‌గా మరో రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు తీర్చాలని ఒత్తిడి పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య ఇందిరతో పాటు ఇద్దరు కుమారులు రాము,నిఖిల్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ నగేష్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ ఏరియా అస్పత్రికి తరలించారు. -
భర్త ఆరోగ్యం నయం కావడంలేదని బలవన్మరణం
చేతి నరాలు, గొంతు కోసుకొని.. భవనంపై నుంచి దూకి మృతి కాటేదాన్: భర్త రెండు కిడ్నాలు పాడవ్వడం.. లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినా నయం కాకపోవడంతో మనోవేదనకు గురై ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. చేతినరాలు, గొంతుకోసుని.. ఆపై దాబా నుంచి దూకి చనిపోయింది. ఈ హృదయ విదారకఘటన మైలార్‌దేవ్‌పల్లిలోని పద్మశాలీపురం బస్తీలో జరిగింది. ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం... పద్మశాలీపురం బస్తీకి చెందిన చేపూరి యాదగిరి, మీనా (33) దంపతులు. వీరికి పాప, బాబు సంతానం. యాదగిరి టైలర్. మద్యం కారణంగా అనారోగ్యానికి గురైన యాదగిరిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీలు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు ధ్రువీకరించారు. నెలరోజులుగా ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న యాదగిరి శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం తిరిగి పొత్తికడుపులో నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. పిల్లల్ని పాఠశాలకు పంపి... లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా భర్తకు నయం కాకపోవడంతో మీనా కృంగిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం ఉదయం పిల్లల్ని పాఠశాలకు పంపిన తర్వాత బ్లేడ్‌తో రెండుచేతుల మణికట్లను, గొంతును కోసుకుంది. ఆ తర్వాత భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. రక్తపుమడుగులో పడివున్న ఆమెను స్థానికులు ఉస్మానియాకు తరలించారు. అప్పటికే ఒంట్లోని రక్తమంతా పోవడంతో చికిత్స అందించేలోపే మీనా మృతి చెందింది. భయాందోళనకు గురైన స్థానికులు... పద్మశాలీపురం బస్తీలోని ప్రజలు ఉదయాన్నే జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలంలో రక్తపుమడుగులో పడివున్న మీనాను చూసి భయాందోళనకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు మొదట ఎవ్వరూ సాహసించలేదు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యాదగిరిని భార్య మృతదేహం చూసేందుకు బంధువులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసిన ఆయన బోరుమన్నాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తిరిగి తీసుకెళ్లారు. తల్లి మృతి చెండం, తండ్రి ఆసుపత్రి పాలుకావడంతో వారి పిల్లలు దిక్కులేని వారిగా మారడం అందరినీ కలచివేసింది.