విజయ్‌కుమార్ మతదేహం
- ట్రాక్టర్ ఫైనాన్స్ కిస్తీ కట్టలేక,
- పంట అప్పులు తీర్చలేక..
సారపాక(బూర్గంపాడు) : సారపాక గ్రామ పంచాయతీలోని పాతసారపాకకు చెందిన యువరైతు కోటమర్తి విజయ్‌కుమార్(28) బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇతను ఐదేళ్లుగా ఆరెకరాల్లో పత్తి, వరి సాగుచేస్తున్నాడు. పంటలసాగు కోసం సుమారు రెండులక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయ పనుల కోసం ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ను కొనగా..కిస్తీ కట్టేందుకు డబ్బులు కరువయ్యాయి. గతంలో పాత ట్రాక్టర్ కొనేందుకు చేసిన అప్పులు కూడా తీరలేదు. పంట అప్పులు కట్టలేక, కిస్తీ డబ్బుల కోసం ట్రాక్టర్ ఫైనాన్స్ వారు వారం రోజుల నుంచి తిరుగుతుండడంతో..ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర మనోవ్యధతో గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి..భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.