AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం | Kazipet Incident: Young Man Attacks Young Woman | Sakshi
Sakshi News home page

AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం

Apr 10 2026 1:44 PM | Updated on Apr 10 2026 2:28 PM

Kazipet Incident: Young Man Attacks Young Woman

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.

ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్‌(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్‌లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement