
‘అన్నా...వైఎస్సార్ హయాంలో దివ్యాంగులకు ప్రతి నెలా 35 కేజీల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బియ్యం ఇవ్వడం లేదు. పైగా అన్ని అర్హతలున్నా పింఛన్లు కూడా మంజూరు చేయడం లేదు’. అని గుడివాడకు చెందిన అహ్మద్, శ్రీకాంత్, సత్యనారాయణ, ఎం.రాజేష్, బాషా, అజీమ్, కె. తులసీరామ్ జననేత జగన్‌మెహన్‌రెడ్డిని కలసి విన్నవించుకున్నారు. దివ్యాంగులు మెరుగైన జీవనాన్ని సాగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి రుణాలను ఇవ్వాలని కోరారు. భూమి కూడా లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. దివ్యాంగులకు అన్ని అర్హతలున్నా పింఛన్లు మంజూరు చేయడం లేదని జననేత దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment