3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటాయని, వారికి 3 శాతం రిజ ర్వేషన్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందే నని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను తొలుత ఆ పేరుతో పిలిచింది ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి.. వారి ప్రాథమిక హక్కని వాటికోసం కేంద్రం కృషి చేస్తుందన్నారు. వీరి కోసం 21 ఓకేషనల్ రిహబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చెవిటి వారికోసం కేంద్రం ఆరు ప్రత్యేక కాలేజీలను తీసుకువస్తోందని తెలిపారు.
అందులో ఒకటి సౌత్‌జోన్‌లో ఏర్పాటు చేస్తారన్నారు. దాన్ని తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్ని స్తానన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 10 లక్షల మంది దివ్యాంగులకు సాయం అందించేందుకు దత్తాత్రేయ సహకారం తీసుకుంటామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాటా ్లడుతూ... రాష్ట్రంలో పింఛన్ రాని దివ్యాంగు లుంటే.. వెంటనే ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వికలాంగుల పిలుపు మాస పత్రికను ఆవిష్క రించారు. ఆటల పోటీల విజేతలకు బహు మతులు, పలువురికి ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ శైలజ, వంశీ రామరాజు, దివ్యాంగుల ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.