వందో వసంతంలోకి క్రికెట్‌ కురువృద్దుడు | Oldest Living Ranji Player To Celebrate 100th Birthday | Sakshi
Sakshi News home page

వందో వసంతంలోకి క్రికెట్‌ కురువృద్దుడు

Nov 20 2020 2:40 PM | Updated on Nov 20 2020 2:41 PM

Oldest Living Ranji Player To Celebrate 100th Birthday - Sakshi

రఘునాథ్‌ చందార్కోర్‌(ఫోటో కర్టసీ: హిందుస్తాన్‌ టైమ్స్‌)

ముంబై:  మహారాష్ట్రకు  చెందిన  మాజీ క్రికెటర్‌ రఘునాథ్‌ చందార్కోర్‌  తన వందో వసంతాన్ని జరుపుకోనున్నారు. రేపు(నవంబర్‌ 21వ తేదీ) ఆయన వందో  ఒడిలోకి అడుగుపెట్టనున్నారు. దాంతో వందేళ్ల పూర్తి చేసుకోబోతున్న మూడో రంజీ క్రికెటర్‌గా రఘునాథ్‌ చందార్కోర్‌ నిలవనున్నారు. ఈ ఏడాది జూన్‌లో కురువృద్ధ క్రికెటర్‌ రాయ్‌జీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.  రాయ్‌జీ కూడా  వంద పుట్టినరోజులు చూసిన రంజీ క్రికెటర్‌లలో ఒకరు. 

ఇక రఘునాథ్‌ చందార్కోర్‌ 1943-44 సీజన్‌ నుంచి 1946-1947 సీజన్‌ వరుకూ మహారాష్ట్రకు ప్రాతినిథ్య వహించారు. అనంతరం 1950-51 సీజన్‌లో ముంబై తరఫున ఆడారు. ప్రస్తుతం ఆయన  ముంబైలోని దాంబివ్లిలో  నివసిస్తున్నారు.  కాగా, ఆయన గత ఆరేళ్లగా మంచం మీదే కాలం వెల్లదీస్తున్నారని ఆయన కోడలు వినితా తెలిపారు. ఆయన జ్ఞాపకశక్తి సన్నగిల్లిందని, అయినప్పటికీ టీవీల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ ఉంటారన్నారు.  ఇది మమ్మల్ని అప‍్పడప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుందని వినితా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement