ఆస్ట్రేలియా క్రికెటర్‌ వార్నర్‌ వీడియో.. బన్నీ రిప్లై ఇదే! | David Warner latest shoot Pushpa Raj in new ad, Allu Arjun reaction goes viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఆస్ట్రేలియా క్రికెటర్‌ వార్నర్‌ వీడియో.. బన్నీ రిప్లై ఇదే!

Published Tue, Jun 11 2024 3:47 PM

David Warner latest shoot Pushpa Raj in new ad, Allu Arjun reaction goes viral

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్‌- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్‌-1కు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. పుష్ప-2లోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, టీజర్, సాంగ్స్‌ ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి.

పుష్ప సినిమా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌ సైతం బన్నీకి ఫ్యాన్‌గా మారిపోయాడు. పుష్ప మేనరిజాన్ని బన్నీ స్టైల్లో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. పుష్ప-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని వార్నర్‌ గతంలోనే వెల్లడించారు.

అయితే తాజాగా వార్నర్‌ ఓ కంపెనీ యాడ్‌లో మెరిశారు. ఈ ప్రకటనలో పుష్ప సినిమాలోని ఫైర్‌ అనే డైలాగ్‌తో మెప్పించారు వార్నర్. ఈ ‍ప్రకటన చూసిన బన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్‌ సింబల్‌ ఇచ్చాడు. కాగా.. ఇటీవల విడుదలైన 'పుష్ప: ది రూల్'లోని 'పుష్ప పుష్ప' సాంగ్‌కు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. షూ డ్రాప్ స్టెప్‌ ప్రాక్టీస్‌ చేస్తూ వార్నర్ కనిపించారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

aa

Advertisement
 
Advertisement
 
Advertisement