
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1987, ఏప్రిల్ 30న జన్మించాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ తల్లిదండ్రుల పేర్లు గురునాథ్ శర్మ, పూర్ణిమా శర్మ.

రోహిత్ తర్వాత ఈ దంపతులకు మరో కుమారుడు జన్మించాడు. అతడి పేరు విశాల్ శర్మ.

కాగా రోహిత్ తల్లి పూర్ణిమ విశాఖపట్నానికి చెందిన వారు. అలా రోహిత్ వైజాగ్‌కు మనువడు అవుతాడు.

రోహిత్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు అతడి కుటుంబం డోంబివలీ ఏరియాకు షిప్ట్ అయింది.

రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ ఓ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో స్టోర్‌హౌజ్ కేర్‌టేకర్‌గా పనిచేసేవారు.

కానీ.. కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ఆదాయం లభించేది కాదు ఆయనకు.

అందుకే డోంబివలీకి మకాం మార్చిన గురునాథ్ శర్మ.. తన పెద్ద కుమారుడు రోహిత్‌ను అతడి బామ్మతాతయ్యల వద్దకు పంపించారు.

బామ్మతాతయ్యల వద్ద పెరిగిన రోహిత్ శర్మ వారాంతాల్లో మాత్రం తల్లిదండ్రులతో గడిపేవాడు. అప్పుడే తమ్ముడు విశాల్‌తో ఆడుకునే సమయం దొరికేది. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడుతూ కబుర్లు చెప్పుకొనేవారట.

ఇక చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న రోహిత్‌లో దాగున్న ప్రతిభను గమనించిన అతడి అంకుల్ క్రికెట్ క్యాంపులో.. పేరును నమోదు చేయించాడు.

14వ ఏట అలా క్రికెట్‌లో అడుగుపెట్టిన ‘హిట్‌మ్యాన్’.. ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టులో కీలక సభ్యుడిగా.. ప్రస్తుతం కెప్టెన్‌గా మారాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.

తనకు మేనేజర్‌గా వ్యవహరించిన రితికా సజ్దేను పెళ్లాడగా.. వీరికి కుమార్తె సమైరా జన్మించింది.

భార్యా, కుమార్తెతో కలిసి ముంబైలోని లగ్జరీ ఏరియాలో నివసిస్తున్నాడు రోహిత్ శర్మ.

అదే విధంగా.. తన తల్లిదండ్రులు, తమ్ముడి కోసం అతడి ఇంటికి కాస్త దూరంలో మరో ఇల్లును కొనుగోలు చేశాడు.

పెద్ద కొడుకుగా కుటుంబం పట్ల తన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్న రోహిత్ శర్మ.. తమ్ముడు విశాల్‌కు కూడా అండగా నిలిచాడు.

క్రికెటర్‌గా తను ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత విశాల్ వేరే చోట ఉద్యోగం చేయకుండా తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించాడు.

విశాల్ శర్మ ప్రస్తుతం ఇండియా, సింగపూర్‌లో ఉన్న రోహిత్ క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నాడు.





