Hardika Pandya and Natasa Stankovic Named Their Baby boy as Agastya Pandya | కొడుక్కి అగస్త్యగా నామకరణం చేసిన పాండ్యా - Sakshi
Sakshi News home page

కొడుక్కి అగస్త్యగా నామకరణం చేసిన పాండ్యా

Published Tue, Aug 18 2020 2:25 PM | Last Updated on Tue, Aug 18 2020 4:47 PM

Hardik Pandya Names His Baby Boy As Agastya - Sakshi

ముంబై : టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కొడుక్కి ‘అగస్త్య’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్దిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన ముద్దుల కొడుకు కోసం ఓ బొమ్మ మెర్సిడెజ్‌ కారును బహుహతిగా పంపిన ఆ కార్‌ డిలర్‌ షిప్‌ కంపెనీకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. కాగా చాలా రోజుల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్ ఐపీఎల్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. (హార్దిక్‌ స్పెషల్‌ ఇన్నింగ్స్‌కు ముంబై విషెస్‌)

ఈ ఏడాది ప్రారంభంలో సెర్బియన్‌ నటి నటాషాతో హార్థిక్‌ పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కాక ముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత గత నెలలో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను పాండ్య తరచూ  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ ఫోటోటు నెట్టింటా వైరలవుతున్నాయి. అంతేగాక పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయిన ఈ జంట సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. (కొడుకుతో దిగిన ఫోటోను షేర్‌ చేసిన హార్దిక్‌)

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement