![ఎగ్జయిటింగ్‌గా ఉంది! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71445623565_625x300.jpg.webp?itok=vTXRuRoM)
ఎగ్జయిటింగ్‌గా ఉంది!
వైవిధ్యమైన కథాంశంతో థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ప్లేయర్’. పర్వీన్‌రాజ్ హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని త్రివిక్రమ్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బ్యాంకాక్, హాంగ్‌కాంగ్ నేపథ్యంలో సాగే ఓ థ్రిల్లర్ మూవీ ఇది. కొత్త పంథాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెల 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.