ఫోటోలను, వీడియోలను నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్‌ఎఫ్‌టీ) రూపంలో జరిపిన అమ్మకాలు 2021లో భారీ ఎత్తున పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్‌ఎఫ్‌టీలపై భారీ ఆదరణ లభిస్తోంది. తమ అభిమాన వ్యక్తుల వాయిస్‌ను, వీడియోలను ,ఫోటోలను దక్కించుకునేందుకు ఎన్‌ఎఫ్‌టీ ప్రేమికులు కోట్ల రూపాయలను వెచ్చించారు.
25 బిలియన్ డాలర్లకు...!
కార్టూన్ ఏప్స్ నుంచి వీడియో క్లిప్‌ల వరకు అన్నింటీని ఆయా ఎన్‌ఎఫ్‌టీ ఔత్సాహికులు 2021లో భారీ ఎత్తున అమ్మకాలను జరిపారు. గత ఏడాదిలో ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాలు దాదాపు 25 బిలియన్ల (సుమారు రూ. 1,84,690 కోట్లు) డాలర్లకు చేరుకుంది. ఈ ఊహాజనిత క్రిప్టో ఆస్తులపై భారీ ఎత్తున ఆదరణను పొందాయి. ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్ ట్రాకర్ DappRadar(డాప్‌రాడర్) డేటా ప్రకారం...2021లో ఎన్‌ఎఫ్‌టీల అమ్మకాలు మందగించాయని సూచించింది.
గత ఏడాది ఆగస్ట్‌లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తరువాతి నెలల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో క్షీణించాయి. డిసెంబరులో మళ్లీ పుంజుకుంది. సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య కాలంలో బిట్‌కాయిన్, ఈథర్ విలువ పెరిగినందున ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. 2021లో దాదాపు 28.6 మిలియన్ వాలెట్లు ఎన్‌ఎఫ్‌టీలను సేల్ చేయగా, అది 2020లో దాదాపు 5,45,000గా ఉంది
పుట్టగొడుగుల్లా ఎన్‌ఎఫ్‌టీ కంపెనీలు..!
ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఎఫ్‌టీలను నిర్వహించే కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిచాయి. అనేక కళాకారులు తమ చిత్రాలను అమ్ముతూ భారీ ఎత్తున సంపాదించారు. 2021 మార్చిలో ఒక ఎన్‌ఎఫ్‌టీ ఏకంగా రూ. 510 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ఆటోమొబైల్, దిగ్గజ మల్టీనేషన్ కంపెనీలు కూడా ఎన్‌ఎఫ్‌టీలను అమ్మేందుకు సిద్దమయ్యాయి. కొకాకోలా, గుచి లాంటి కంపెనీలు కూడా ఎన్‌ఎఫ్‌టీలను విక్రయించాయి.
భారత్‌లో బూమ్..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్‌ఎఫ్‌టీపై భారీ ఆదరణే వచ్చింది. అమితాబ్ బచ్చన్, సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, దినేశ్ కార్తీక్, యూవీ, రిషబ్ పంత్ లాంటివారు కూడా తమ ఆడియో, వీడియో, ఫోటోలను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో వేలం వేసేందుకు సిద్దమయ్యారు. ఇక భారత్‌కు చెందిన మెటాకోవన్ అని పిలువబడే విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్ ఫోటో ఎన్‌ఎఫ్‌టీను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే..
Comments
Please login to add a commentAdd a comment