ప్రముఖ హీరో దగ్గుబాటి రానా జాక్ పాట్ కొట్టేశారు. రానా కో- ఫౌండర్‌గా ఉన్న ఐకాన్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మార్క్ జుకర్ బెర్గ్, బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌లు క్యూ కట్టారు. ఇదే విషయంపై రానా సంతోషం వ్యక్తం చేశారు.
2021 ఆగస్ట్‌లో రానా అతని స్నేహితులు ఐకాన్జ్ అనే సంస్థను ప్రారంభించారు. డిజిటల్ ఆస్తుల నిర్వహణ, డిజిటల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ), ఎన్‌ఎఫ్‌టీలను మెటావర్స్‌లలో మానిటైజ్ చేయడంలో సహాయపడే ఒక ప్లాట్‌ఫారమ్. ఇప్పుడు ఈ సంస్థలో మార్క్ జుకర్ బెర్గ్, బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌లు నిర్వహిస్తున్న వెంచర్ క్యాపిటల్ సంస్థ 'విలేజ్ గ్లోబల్' ఐకాన్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) ఓనర్‌గా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అద్భుతమైన అవకాశాల్ని అందిస్తుంది. వాటిపై దృష్టి పెట్టడానికి అద్భుతమైన అవకాశాలతో పాటు సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇక ఐకాన్జ్‌లో కో - ఫౌండర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే 'అమర్ చిత్ర కథ', టింకిల్, సురేష్ ప్రొడక్షన్స్ లు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ భాగస్వామిగా ఉన్నాయని దగ్గుబాటి రాణా అన్నారు.
చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment