మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న 2019 ఆగస్ట్‌లో మాన్‌హట్టన్ జైలు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ ఎప్‌స్టిన్‌ను ఎందుకు కలుసుకున్నారో చెప్పాలని మండిపడ్డారు. అంతేకాదు బిల్ గేట్స్ నుంచి మీరు విడిపోవడానికి ఎప్‌స్టీన్‌తో రిలేషన్‌షిప్ ప్రధాన కారణమా? అని ప్రశ్నించగా.. అనేక కారణాలలో ఇది కూడా ఒకటి అని బదులివ‍్వడం ఆసక్తికరంగా మారింది.
లైంగిక వేధింపులకు పాల్పడిన ఎప్‌స్టిన్‌ను బిల్ గేట్స్ ఎందుకు కలుసుకునేవారు. ఇదే విషయాన్ని బిల్‌గేట్స్ అడిగితే కారణాలు చెబుతారు. అందుకే నేనే అతనెవరు? అతని గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. ఓ సారి అతన్ని కలిశాను. కలిసిన తరువాత అనిపించింది. నేను ఎప్‌స్టిన్ ఎందుకు కలిశానా' అని చింతించాను. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని, ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేసేది. మంచి వ్యక్తిత్వం కాదని అభివర్ణించింది.
ఇక ఇంటర్వ్యూలో..జెఫ్రీను కలవడం మీరు(మిలిందా) బిల్‌గేట్స్ విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యిందా? అని జర్నలిస్ట్ అడిగినప్పుడు.. మేమిద్దరం విడిపోవడానికి అనే కారణాలున్నాయి. అందులో ఇదొకటి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బిల్, మిలిండాలకు ఆగస్టులో విడాకులు మంజూరు కాగా..ఎప్‌స్టీన్‌తో గడిపి తాను చాలా పెద్ద తప్పు చేశానని సీఎన్ఎన్‌తో గేట్స్ అన్నారు. కానీ, తన ఫౌండేషన్‌కు నిధుల సేకరణే లక్ష్యమని చేసిన వ్యాఖ్యాల్ని మిలిందా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment