మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడిగా, సీఈఓగా బిల్ గేట్స్ అని మనందరికీ తెలుసు, కానీ మనలో ఎంత మందికి గేట్స్ అమెరికాలో అతిపెద్ద రైతు అని తెలుసు. మీలో చాలా మంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు కానీ, ఇది నిజం. గేట్స్ అమెరికా అతిపెద్ద రైతులలో ఒకరు. బిల్ గేట్స్, అతని భార్య మెలిండా గేట్స్ 18 అమెరికన్ రాష్ట్రాలలో 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ల్యాండ్ రిపోర్ట్, ఎన్ బీసీ రిపోర్ట్ ప్రకారం.. గేట్స్ లూసియానా, నెబ్రాస్కా, జార్జియా ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు.
నార్త్ లూసియానాలోనే గేట్స్‌కు 70,000 ఎకరాల భూమి ఉందని, అక్కడ వారు సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు. అలాగే నెబ్రాస్కాలో ఉన్న 20,000 ఎకరాలలో అక్కడ రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇంకా జార్జియాలో ఉన్న 6000 ఎకరాలు, వాషింగ్టన్ లో ఉన్న 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో బంగాళాదుంపలను పండిస్తున్నారు. ఒకసారి గేట్స్‌ను రెడ్‌డిట్‌లోని తన వ్యవసాయ భూముల గురించి అడిగినప్పుడు దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.. “ప్రస్తుత ప్రపంచంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. ఎక్కువ మొత్తంలో పంటలు పండించడం ద్వారా అటవీ నిర్మూలనను నివారించవచ్చు. అలాగే ఆఫ్రికా వంటి దేశాలలో ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను, ఆహార సమస్యను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది” అని అన్నారు. బిల్ గేట్స్ , మెలిండా వ్యవసాయ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆస్పష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment