
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్‌గేట్స్ దంపతులకు విడాకులు ఖరారయ్యాయి. అమెరికాలోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి వారి విడాకుల పత్రాలపై సంతకాలు చేయడంతో వారి 27 ఏళ్ల వివాహ బంధానికి తెరపడినట్లు అయింది. అయితే వారి మధ్య ఆస్తుల పంపకాలు ఎలా ఉంటాయన్న వివరాలేమీ కోర్టు డాక్యుమెంట్స్‌లో కనిపించలేదు. 1987లో మైక్రోసాఫ్ట్‌లో కలుసుకున్న వీరు 1994లో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం విడిపోతున్నట్లు ఈ ఏడాది మేలో బిల్‌గేట్స్ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ప్రకటించారు. తాము విడిపోతున్నప్పటికీ తమ సంస్థ అయిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్లో కలసి పని చేస్తామని చెప్పారు. ఒక వేళ వారు కలసి పని చేయలేమని భావిస్తే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ కో–చైర్, ట్రస్టీగా రాజీనామా చేస్తారని ఇటీవలే ఫౌండేషన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment