bill gates foundation
-
పోలియోపై పోరుకు రూ.9.8 వేల కోట్ల విరాళం
బెర్లిన్: ప్రపంచ వ్యాప్తంగా పోలియో మహమ్మారిపై సాగే పోరాటానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.8 వేల కోట్ల)సాయం ప్రకటించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. పోలీయో నిర్మూలన కోసం ఇప్పటి వరకు 5 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు వెల్లడించింది. పోలీయోపై పరిశోధనలు, కొత్త వేరియంట్ల గుర్తింపు సహా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్లో 20, అఫ్గానిస్తాన్‌లో 2 పోలీయో కేసులు నమోదైన క్రమంలో ఆయా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రపంచం ఈ మహమ్మారిని అంతం చేస్తానని మాటిచ్చిందని, ఏ ఒక్కరు ఈ వ్యాధిపై భయంతో జీవించకూడదంటూ ట్వీట్ చేసింది బిల్ అండ్ మెలిండా గేట్స్. The world made a promise to #EndPolio for good. No one should live in fear of this preventable disease. The Gates Foundation is proud to commit $1.2B toward helping health workers stop all forms of this virus and protect children forever. https://t.co/oA7RNzcOIy — Gates Foundation (@gatesfoundation) October 16, 2022 ఇదీ చదవండి: Bill Gates: ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్‌కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు తన ఆస్తిలో సుమారు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందుకే నాకు, నాకుటుంబానికి కావాల్సినంత ఖర్చు చేసి మిగిలిన మొత్తం ఫౌండేషన్‌కు ఇవ్వాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు లక్షన్నకోట్లు విరాళం ఇస్తున్నట్లు బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌కు సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. పెరిగిపోతున్న సంపదను ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఖర్చు చేస్తుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆ ఫౌండేషన్‌కు బిల్‌గేట్స్ పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
విడాకుల కన్నా అదే ఎక్కువ బాధించింది: బిల్‌గేట్స్
ప్రతీ వివాహ బంధం.. ఒక దశ దాటిన తర్వాత మార్పునకు లోనవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవ్వడం, పెళ్లి చేసుకుని లేదంటే ఉద్యోగాల కోసమే ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ, నా వరకు వచ్చేసరికి ఆ మార్పు విడాకుల రూపంలో ఎదురైంది అని అంటున్నారు టెక్ దిగ్గజం బిల్‌గేట్స్. సండే టైమ్స్‌తో తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై స్పందించాడు బిల్‌గేట్స్. అయితే విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిలిందా ఫ్రెంచ్‌తో వివాహం, విడాకులు.. ఇప్పుడు ఆమెతో కలిసి ఫౌండేషన్ కోసం కలిసి పని చేయడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు ఆయన. మిలిందాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అవకాశం వదులుకోను అంటూ వ్యాఖ్యానించారాయన. గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిలిందాతో కలిసి వర్కింగ్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఫౌండేషన్ కోసం పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని, అది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడాయన. ఇంతగా ప్రేమించినప్పుడు.. వివాహ బంధం ఎందుకు ముగిసిందని ప్రశ్న ఎదురుకాగా.. పెళ్లిళ్లు క్లిష్టమైనవి. వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు. మా వివాహ బంధం ఎందుకు విఫలమైందని విషయం ఇప్పుడు అప్రస్తుతం అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు. 2021 మే నెలలో బిల్, మిలిందా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి విడాకులు కన్ఫర్మ్ అయ్యింది. బిల్ గేట్స్, మిలిందా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: బిల్‌గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!! -
ప్రియుడితో బిల్‌గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహ వేడుక సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్‌లో జరిగినట్లు సదరు మ్యాగజైన్ ప్రచురించింది. కొన్ని నెలల క్రితం మిలిందా గేట్స్‌తో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్-నాజర్‌ల పెళ్లి జరిగినట్లు పీపుల్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. నాజర్‌ది సంపన్న కుటుంబమే.. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా తరఫున నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాయల్ నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది. చివరకు సోషల్ మీడియా వేదికగా జెన్నీఫర్ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్‌గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్‌గేట్స్‌తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు పీపుల్ మ్యాగజైన్ తెలిపింది. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది ‘నాయల్ నాజర్.. నువ్వు నాకు దొరికిన ఒక అదృష్టానివి. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది. మన జీవితం కలిసి పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జెన్నీఫర్. ‘ ప్రపంచంలో నేను అదృష్టవంతుడ్నే కాదు.. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్‌ని కూడా. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ప్రతీ ఉదయాన్ని, ప్రతీ రోజుని ఒక కల అంత అందంగా ఆస్వాదించేలా చేసిన నీకు చాలా థాంక్స్’ అని నాజర్ తెలిపాడు. బిల్‌గేట్స్-మిలిందా మే 4న ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్‌గేట్స్ ముగింపు పలికినట్లు అయ్యింది. కాగా, బిల్‌గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్ గేట్స్. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట. -
బిల్‌గేట్స్‌నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్
ఆర్థిక నేరాలు, కుంభకోణాలు మనం నిత్యం చూస్తున్నవే. కానీ, ఆ నేరాల్లో నైపుణ్యం ఉన్నవాళ్లే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నది మేధావుల మాట. ఆర్థిక మేధావిగా ప్రపంచం నుంచి జేజేలు అందుకున్న అరిఫ్ నక్వీ.. తర్వాతి కాలంలో ‘స్కామర్’గా ఓ మాయని మచ్చను అంటించుకున్నాడు. ప్రస్తుతం తాను పాల్పడ్డ ఆర్థిక నేరాలకు సుదీర్ఘ కాలం జైలుశిక్ష అనుభవించేంత పరిస్థితికి చేరుకున్నాడు. అందులో బిల్‌గేట్స్‌ను 700 కోట్ల రూపాయలకు బురిడీ కొట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన అబ్రాజ్ గ్రూపుల అధినేతే ఈ అరిఫ్ నక్వీ(60). ప్రపంచానికి ఏదో మంచి చేస్తామంటూ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. కంపెనీలు, సేవా కార్యక్రమాల పేరిట పెట్టుబడులను స్వీకరించాడు. ఈ క్రమంలో దర్పం ప్రదర్శిస్తూ గొప్ప గొప్పవాళ్లతో భేటీ అవుతూ.. తెలివిగా బోల్తా అందరినీ ఏమాయ చేశాడు. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలతో పాటు గోల్డ్‌మ్యాన్ సాచ్స్ మాజీ సీఈవో లాయ్డ్ బ్లాంక్‌ఫెయిన్, బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటి ప్రముఖలెందరో అరిఫ్ చేతిలో మోసపోయినవాళ్ల లిస్ట్‌లో ఉన్నారు. ‘ది కీ మ్యాన్: ట్రూ స్టోరీ ఆఫ్ హౌ ది గ్లోబల్ ఎలైట్ వాస్ డూప్డ్ బై ఏ క్యాపిటలిస్ట్ ఫెయిరీ టెయిల్’ అనే బుక్‌లో సైమన్ క్లార్క్, విల్ లాంఛ్ ద్వయం ఈ బిల్డప్ బాబాయ్ మోసాల గురించి రాశారు. మొత్తం ఫండ్స్ నుంచి 780 మిలియన్ డాలర్ల సొమ్మును ఎలా పక్కదారి పట్టించాడు, మరో 385 మిలియన్ డాలర్ల సొమ్మును లెక్కల్లోనే లేకుండా ఎలా చేశాడు అనే వివరాల్ని ప్రస్తావించారు. ఇక బిల్‌గేట్స్ సహాయక కార్యక్రమాల ఫౌండేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దావోస్ సదస్సులో తనను తాను ఓ వ్యాపార దిగ్గజంగా పరిచయం చేసుకున్న అరిఫ్.. తన కంపెనీ ర్యాంకింగ్లంటూ, ఎన్జీవో సేవాకార్యక్రమాలంటూ ఫేక్ వివరాలను, సర్వేలను చూపించాడు నక్వీ. చేయూత నివ్వాలంటూ కోరడం, అతని ఆర్భాటాలు-హడావిడి చూసి గేట్స్ మోసపోవడం గురించి వివరంగా రాశారు ఆ బుక్‌లో. అయితే అబ్రాజ్ తరపున నక్వీ మోసాలు బయటకు రావడం, అప్పటికే ఆలస్యం కావడంతో నష్టం జరిగిపోయిందంటూ బుక్‌లో తెలిపారు. పాక్‌లో ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ల కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ల కోసం 100 మిలియన్ డాలర్ల(700 కోట్ల రూపాయలపైనే) సాయం అందించింది గేట్స్ ఫౌండేషన్. అలా ఆ డబ్బును తన ఖాతాలో వేసేసుకున్నాడు నక్వీ.. రహస్యాంగా అంతా ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. బిల్డప్ బాబాయ్ నేపథ్యం 1960లో పాకిస్తాన్ కరాచీలో పుట్టిన నక్వీ.. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆర్థిక మేధావిగా ఎన్నో సదస్సుల్లో ప్రసగించడమే కాకుండా, ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఆపై అమన్ పేరుతో ఓ ఫౌండేషన్ నెలకొల్పి.. చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు. 2003లో ఇస్లాం దేశాల రాజులు, వ్యాపారుల నుంచి 118 మిలియన్ డాలర్లను సేకరించాడు. ఆ సొమ్ముతో అబ్రాజ్ కంపెనీని నెలకొల్పి.. భారీ అవతకవలకు పాల్పడ్డాడు. 2010లో ఒబామా అధ్యక్షతన అమెరికాలో జరిగిన ఎంట్రాప్రెన్యూర్షిప్ సమ్మిట్‌కు నక్వీ కూడా హాజరయ్యాడు. అంతేకాదు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సైతం దక్కించుకున్నాడు. దుబాయ్‌లో లగ్జరీ ఇంటిలో విలాసవంతమైన జీవితం గడిపిన నక్వీ.. కంటితుడుపుగా యూనివర్సిటీలకు విరాళాలు ఇస్తుండేవాడు. ఈ బిల్డప్లతోనే సుమారు 300 కంపెనీల నుంచి పెట్టుబడులను రాబట్టాడంటే అతిశయోక్తి కాదు. పైగా దావోస్ లాంటి విదేశీ సమ్మిట్లకు హాజరవుతూ.. బిల్‌గేట్స్‌లాంటి బిలియనీర్లెందరితోనో పరిచయం పెంచుకున్నాడు. 2017లో ఆయన అవినీతి గురించి ఉద్యోగులు మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. ఆరోపణల తర్వాత గేట్స్ ఫౌండేషన్ ఈ ఆరోపణలపై ప్రైవేట్ దర్యాప్తునకు ఆదేశించింది. చివరికి ఆ ఆరోపణల ఆధారంగా నక్వీని నేరస్తుడిగా తేల్చిన అమెరికా కోర్టు.. ఏప్రిల్ 10, 2019న లండన్ హెత్రో ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేయించింది. అయితే బెయిల్ దొరికినప్పటికీ.. వ్యక్తిగత పూచీ కత్తులపై హౌజ్ అరెస్ట్‌ను కొనసాగిస్తున్నారు. మరోవైపు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ కూడా నక్వీ నేరాలపై విచారణ కొనసాగిస్తోంది. నక్వీ ఆర్థిక నేరాలు గనుక రుజువైతే 300 ఏళ్లు జైలు శిక్ష పడనుంది. చదవండి: డర్టీ బిజినెస్- భార్య ఎఫైర్లను సైట్లో పెట్టిన గూగుల్ ఫౌండర్ -
మగవాళ్ల కోసం సంతాన నిరోధక మాత్రలు! అతి త్వరలో..
Male Contraceptive Pill:ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. సేమ్.. మగవాళ్లకూ అలాంటి మాత్రలు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో.. అలాగే ఇవి మగవాళ్లపై పని చేస్తాయట. అంటే.. మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీ ఆపుతాయన్నమాట. కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ డుండీ(స్కాట్లాండ్) ప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా.. ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. బిల్‌గేట్స్ సహకారం ఈ మాత్రలు మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. కారణం.. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ ప్రయోగాల వెనుక ఉండడం. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. ఇందుకోసం ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయం అందించింది కూడా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలా ఈ ట్యాబ్లెట్లను రూపొందిస్తున్నట్లు డుండీ యూనివర్సిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బర్రాత్ ఓ ప్రకటనలో వెలువరించాడు. సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌లను మార్కెట్లోకి తెచ్చారు సైంటిస్టులు. అయితే వీటి తర్వాత మెడికల్ సైన్స్‌లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు.. అదీ ఇంత కాలానికి తెర మీదకు రావడం విశేషం. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని University of Dundee ప్రొఫెసర్ క్రిస్ చెప్తున్నాడు. అయితే సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా? అని ప్రశ్నిస్తే.. తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు ఆయన. -
బిల్‌గేట్స్ దంపతులకు విడాకులు ఖరారు
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్‌గేట్స్ దంపతులకు విడాకులు ఖరారయ్యాయి. అమెరికాలోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి వారి విడాకుల పత్రాలపై సంతకాలు చేయడంతో వారి 27 ఏళ్ల వివాహ బంధానికి తెరపడినట్లు అయింది. అయితే వారి మధ్య ఆస్తుల పంపకాలు ఎలా ఉంటాయన్న వివరాలేమీ కోర్టు డాక్యుమెంట్స్‌లో కనిపించలేదు. 1987లో మైక్రోసాఫ్ట్‌లో కలుసుకున్న వీరు 1994లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం విడిపోతున్నట్లు ఈ ఏడాది మేలో బిల్‌గేట్స్ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ప్రకటించారు. తాము విడిపోతున్నప్పటికీ తమ సంస్థ అయిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌లో కలసి పని చేస్తామని చెప్పారు. ఒక వేళ వారు కలసి పని చేయలేమని భావిస్తే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ కో–చైర్, ట్రస్టీగా రాజీనామా చేస్తారని ఇటీవలే ఫౌండేషన్ ప్రకటించింది. -
అవును వాళ్లిద్దరు విడిపోయారు.. అధికారికంగా.!
బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ దాంపత్య జీవితానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నారు. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదే ఈ పరిణామం.! 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా మే నెలలో విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల తర్వాత వారి నిర్ణయాన్ని అంగీకరిస్తూ వాషింగ్టన్ కు చెందిన కింగ్ కౌంటీ న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. దీంతో బిల్ గేట్స్, మెలిందా గేట్స్ బంధానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది. మే నెలలో బిల్‌గేట్స్ - మెలిందాలు తాము విడిపోతున్నట్లు, విడాకుల కోసం కింగ్ కౌంటీ కోర్ట్‌ను ఆశ్రయిస్తున్నట్లు చెప్పి ప్రపంచానికి షాకిచ్చారు. దీంతో వారు విడిపోవడంపై రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ దంపతుల విడాకులు మరోమారు చర్చకు దారితీశాయి.. అమెరికా చట్టాల ప్రకారం డివోర్స్ కావాలంటే మూడు నెలలు ఎదురు చూడాల్సి ఉంది. అందుకే బిల్‌గేట్స్ దంపతులు విడాకుల కోసం ఇంతకాలం ఎదురు చూశారు. సోమవారంతో ఆ గడువు పూర్తి కావడంతో కింగ్ కౌంటీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. బ్లూం బెర్గ్ బిలినియర్ ఇండెక్స్ ప్రకారం.. విడాకులతో సుమారు 152 బిలియన్ల డాలర్లుగా ఉన్న బిల్ గేట్స్ ఆస్తిని ఎలా పంచుకుంటారో తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఫ్రెంచ్ గేట్స్‌కి బదిలీ చేసినట్టు అమెరికన్ మీడియా 'టీఎంజీ' తన కథనంలో పేర్కొంది. ఇక వాషింగ్టన్ న్యాయ నిబంధనల ప్రకారం.. వివాహ సమయంలో ఆస్తులు,ఇతర వ్యవహారాల్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారో.. విడిపోయే సమయంలో కూడా ఆ నిబంధనలపై కట్టుబడి ఉండాలి. వాటికి లోబడే బిల్‌గేట్స్-మెలిందా గేట్స్ ఆస్తుల్ని పంచుకోవాలని న్యాయమూర్తి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ ఆస్తి ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే ఒక్కొక్కరి ఆస్తి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
గేట్స్ దంపతుల విడాకులు: కుమార్తె భావోద్వేగం
వాషింగ్టన్: ‘‘నా తల్లిదండ్రులు విడిపోతున్నారన్న వార్త మీలో చాలా మంది వినే ఉంటారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, నా భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కావడం లేదు. నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా నేనేమీ కామెంట్ చేయదలచుకోలేదు. కానీ ఈ సమయంలో మీరిచ్చే మద్దతు నాకెంతో ఊరట కలిగిస్తుంది’’ అంటూ గేట్స్ దంపతుల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులు ఇకపై కలిసి ఉండబోవడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. కాగా సతీమణి మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన జెన్నిఫర్ ఇన్‌స్టా వేదికగా ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, తమకు అండగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా 1994లో బిల్, మిలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) సంతానం. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే! -
బిల్ గేట్స్ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు!
వాషింగ్టన్: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. మిలిందా గేట్స్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సతీమణి మిలిందా గేట్స్‌తో కలిసి ట్విటర్ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 27 ఏళ్ల బంధం ఇక ముగిసింది.. ‘‘మా బంధం కొనసాగాలా లేదా అన్న అంశం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత విడిపోవాలనే నిర్ణయానికివచ్చాం. గత 27 ఏళ్ల బంధంలో ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ఫౌండేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆరోగ్యవంతులుగా, మెరుగైన జీవనం గడిపేలా మా వంతు కృషి చేశాం. ఈ మిషన్ ఇలాగే కొనసాగిస్తాం. ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తాం. అయితే, మా జీవితంలోని తదుపరి దశలో దంపతులుగా మాత్రం కొనసాగలేం. దయచేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్న మాకు, మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మనవి’’ అని మిలిందా, బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. సంపదలో కుబేరులు.. మానవత్వంలోనూ స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్‌తో కలిసి 1975లో బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చిననాటికి అందులో గేట్స్ వాటా 49%. బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక ప్రకారం బిల్ గేట్స్ సంపద ప్రస్తుతం 124 బిలియన్ డాలర్లు. కాగా 1970లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన.. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. అలా మొదలైంది ఇక 1987లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా జాయిన్ అయిన మిలిందా, అదే ఏడాదిలో ఓ డిన్నర్ పార్టీలో బిల్ గేట్స్‌ను కలిశారు. ఈ క్రమంలో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు ఫౌండేషన్ స్థాపించి.. గేట్స్ దంపతులు 2000లో సియాటిల్‌లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో మానవీయ కార్యక్రమాల నిర్వహణ కోసం కోట్లాది డాలర్లను విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించారు. ప్రధానంగా ప్రజారోగ్యం, విద్య తదితర అంశాలపై దృష్టి సారించి ఎంతో మందికి సాయం చేశారు. పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మహిళా సాధికారికతకై తమ వంతు కృషి చేశారు. అంతేకాదు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికై ఈ ఫౌండేషన్ 1.75 బిలియన్ డాలర్ల గ్రాంట్లు విడుదల చేసింది. తద్వారా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. కాగా 2018 వరకు బిల్, మిలిందా గేట్స్ ఈ ఫౌండేషన్‌కు సుమారు 36 బిలియన్ డాలర్లను సమకూర్చారు. 2006 నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ 29 బిలియన్ డాలర్లను ఈ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. pic.twitter.com/padmHSgWGc — Bill Gates (@BillGates) May 3, 2021 -
రానున్న 4-6 నెలలు జాగ్రత్త: బిల్ గేట్స్
వాషింగ్టన్: రానున్న 4-6 నెలల్లో కరోనా వైరస్ మరిన్ని సవాళ్లు విసరవచ్చని గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ తాజాగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం వంటివి విధిగా చేయవలసి ఉన్నట్లు నొక్కి చెప్పారు. లేదంటే వైరస్ మరింత విజృంభించవచ్చని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీలకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ పరిశోధన, ఆర్థిక సహకారమందిస్తున్న సంగతి తెలిసిందే. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!) మరో 2 లక్షల మంది యూఎస్‌లో కోవిడ్-19 విలయానికి ఇప్పటివరకూ 2.9 లక్షల మందికిపైగా ప్రాణాలు విడిచారు. అయితే ఇటీవల అదనంగా 2 లక్షల మంది మరణించే అవకాశమున్నట్లు ఆరోగ్య అంశాలను మదింపు చేసే ఐహెచ్ఎంఈ అంచనా వేసింది. ఇదెంతో బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహచైర్మన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. అయితే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర చర్యల ద్వారా వీటి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఇటీవల యూఎస్‌లో గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని భావిస్తున్నట్లు చెప్పారు. 2015లోనే వైరస్ల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలకు వీలున్నట్లు 2015లో అంచనా వేసినప్పటికీ కోవిడ్-19 ఇంతకంటే అధిక నష్టాన్ని కలిగిస్తున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. నిజానికి ముందుముందు మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. వైరస్ కారణంగా ఇటు యూఎస్.. అటు ప్రపంచంపై పడిన ఆర్థిక ప్రభావం ఆందోళనలు కలిగిస్తున్నట్లు చెప్పారు. -
వాక్సిన్‌పై సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దేశీయ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్ తయారీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. 2021 ప్రతమార్థంలోనే 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. తొలి విడతలోనే మధ్యతరగతి వర్గాల వారికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్ అండ్ మిలంద్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తికి సిరమ్ శ్రీకారం చుట్టింది. ఒక్కో డోసు రూ.250 ఉండే విధంగా.. మధ్యతరగతివారికి మిలంద్‌గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించనుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. (దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ) ఇక భారత్ బయోటెక్ రూపిందిస్తున్న కోవాగ్జిన్ సైతం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ కోసం దేశంలోని 12 ప్రయోగ కేంద్రంల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతికి అదుపులోకి రాకపోవడంతో ప్రపంచ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్ తయారీపై దృష్టిసారించాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇప్పటికే మూడో విడత ప్రయోగ దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై అశలు పెట్టుకున్నారు. -
కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225
సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుండి గవి ద్వారా 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందుతాయి. (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త) ప్రధానంగా ఇండియాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న తరుణంలో 10 కోట్ల మోతాదుల కరోనా వైరస్ వాక్సీన్లను తయారీ చేయనున్నామని ఎస్ఐఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు డీల్‌పై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర గరిష్టంగా 3 డాలర్లు (సుమారు 225 రూపాయలు) ఉంటుందని, వీటిని 92 దేశాల్లో గవికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్(ఏఎంసీ)లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. 2021 చివరి నాటికి కోట్లాది వాక్సిన్లను అందించాలనేది ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్, గేట్స్ ఫౌండేషన్, గావిసేత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్ఐఐ సీఈఓ అధమ్ పూనావల్లా ట్వీట్ చేశారు. 2021నాటికి అతి తక్కువ ధరలో ప్రపంచంలోని వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాక్సీన్ల ప్రాప్యత విషయంలో చాలా వెనుక బడిన దేశాలు ఇబ్బందులు పడటం గతంలో చూశామని గవి సీఈఓ డాక్టర్ సేథ్ బెర్క్ లీ అన్నారు. కాగా ఎస్ఐఐ సంస్థతో తమవాక్సిన్ సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోవావాక్స్ ఈ వారంలో ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాలను ఎస్ఐఐ ఇప్పటికే కుదుర్చుకుంది. అటు దేశంలో చివరి దశ మానవ పరీక్షలకు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిన సంగతి తెలిసిందే. I would like to thank @BillGates, @gatesfoundation, @GaviSeth for this key partnership of risk sharing and manufacturing of a 100 million doses, which will also ensure equitable access at an affordable price to many countries around the world. https://t.co/NDmpo23Ay8 pic.twitter.com/jNaNh6xUPy — Adar Poonawalla (@adarpoonawalla) August 7, 2020 -
సమానత్వం కోసం వేచి ఉండే పనే లేదు
‘‘నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టు, ఆడపిల్లగా పుట్టావంటే చాలు, జీవితాన్ని నెట్టుకురావడానికి చాలా దుర్భరమైన, దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు’’. ఈ మాట అన్నది మామూలు మహిళ కాదు. మిలిందా గేట్స్. బిల్ గేట్స్ సతీమణి. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ సహ వ్యవస్థాపకురాలు. ప్రపంచ దేశాల్లో పర్యటించి ఆడవాళ్లు, పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన మహిళ. తాను చూసిన ఘటనలతో ‘ద మోమెంట్ ఆఫ్ లిఫ్ట్’ అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన మహిళ. గేట్స్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గేట్స్ దంపతులు సోమవారం సంయుక్తంగా ఒక వార్షిక లేఖను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్యం, విద్య, స్త్రీ పురుష సమానత్వాలకు మున్ముందు మరింత ప్రాముఖ్యం ఇవ్వబోతునట్లు‡ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో స్త్రీ–పురుష సమానత్వం గురించి మిలిందా పంచుకున్న విషయాలు ఆలోచన రేకెత్తించేవిలా ఉన్నాయి. అదే సమయంలో స్త్రీ పురుష సమానత్వం సాధ్యమే అనే ఆశనూ చిగురింపజేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ఇరవయ్యవ వార్షికోత్సవంతోపాటు, చరిత్రాత్మకమైన బీజింగ్ వరల్డ్ కాన్ఫరెన్స్‌కూ ఈ ఏడాది పాతికేళ్లు నిండబోతున్నాయి. ఆనాటి బీజింగ్ సదస్సు మహిళల స్థితిగతుల మీద చర్చించడానికి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని మిలిందా తన లేఖలో గుర్తు చేశారు. 1995లో బీజింగ్‌లో జరిగిన ఉమెన్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో హిల్లరీ క్లింటన్ ప్రసంగిస్తూ ‘మానవ హక్కులే మహిళల హక్కులు.. మహిళల హక్కులే మానవ హక్కులు’ అన్నారు. ఆ మాట తనను ఎంత ఇన్స్పైర్ చేసిందీ చెప్పారు. ‘ఆ తర్వాత నేను ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో పర్యటించాను. అక్కడి మహిళలను చూసిన తర్వాత స్త్రీ– పురుష సమానత్వ సాధన కోసం స్త్రీలకు అవసరమైన శక్తినివ్వడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను చెప్పదలచినది ఏమంటే.. మన శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మహిళలమందరం ముందుకు రావాలి. అప్పుడు సమానత్వం కోసం వేచి చూడాల్సిన పనే ఉండదు’ అని లేఖలో రాశారు మిలిందా గేట్స్. బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహణతోపాటు మిలిందా గేట్స్ సొంతంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విరాళాలతో సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళాభివృద్ధి ద్వారా కుటుంబాల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా సమాజాభివృద్ధి సిద్ధిస్తుందని చెబుతారామె.మిలిందా గేట్స్ యూఎస్‌లోని డ్యూక్స్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ చేశారు. ఒక దశాబ్దం పాటు తన కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టారామె. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని కుటుంబం, సమాజ సేవ కోసం కేటాయించారు. -
మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్‌కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డు వరించింది. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రారంభించినందుకు గాను మిలిందా గేట్స్ ఫౌండేషన్ మోదీకి ఈ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘గాంధీ జీ స్వచ్ఛత కల ఈ అవార్డుతో నెరవేరిందని భావిస్తున్నాను. మహాత్మడి 150వ జయంతి జరుపుకోబోతున్న ఏడాదే నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కడికే వచ్చిన అవార్డు కాదు. ఇది నా దేశ ప్రజలందరిది. 130 కోట్ల మంది ప్రజలు ఓ ప్రతిజ్ఞ చేశారంటే.. అది తప్పక నెరవేరుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 3 లక్షల మంది ప్రజలను రోగాల బారి నుంచి కాపాడగల్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గతంలో పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల మన కుమార్తెలు చదువు మధ్యలోనే ఆపేసి.. ఇంటికి పరిమితమయ్యేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చింది’ అన్నారు మోదీ. స్వచ్ఛ సర్వేక్షన్ వల్ల భారతదేశ రాష్ట్రాలు ఇప్పుడు పరిశుభ్రతలో ఉన్నత ర్యాంకు కోసం ఒకదానితో ఒకటి పోటీ పడటం తనకు సంతోషాన్ని కల్గిస్తుందన్నారు మోదీ. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గాంధీ కలలు కన్నా పరిశుభ్ర భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మహాత్మా గాంధీకి నివాళిగా ప్రధాని మోదీ 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడం, గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. -
మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరో అవార్డు వరించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంలో నడిచే 'బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్' పురస్కారాన్ని మోదీని అందుకోనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ప్రధాని మోదీ వినూత్న కార్యక్రమాలు చేపపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పురస్కారాలు ఆయనను వరిస్తున్నాయి. తాజాగా స్వచ్ఛ భారత్ పథకానికిగాను ప్రధానికి బిల్ - మిలిందా గేట్స్ ఫౌండేషన్ పురస్కారం దక్కింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణం ' అని జితేంద్ర ట్విటర్లో తెలిపారు. ఇటీవలే ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయేద్'ను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ పథకాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా బిల్ గేట్స్ ప్రశంసించారు. మే 2018లో బిల్ గేట్స్ 'ఆధార్' పథకానికి మద్దతిచ్చారు. Another award,another moment of pride for every Indian, as PM Modi's diligent and innovative initiatives bring laurels from across the world. Sh @narendramodi to receive award from Bill & Melinda Gates Foundation for #SwachhBharatAbhiyaan during his visit to the United States. pic.twitter.com/QlsxOWS6jT — Dr Jitendra Singh (@DrJitendraSingh) September 2, 2019 -
కాదేది వ్యర్థం..!
♦ దేశంలోనే మొదటగా నరసాపురంలో మలవ్యర్థ శుద్ధి కేంద్రం ♦ రూ 1.20 కోట్ల బిల్‌గేట్స్ ఫౌండేషన్ నిధులతో నిర్మాణం ♦ అమెరికా టెక్నాలజీతో నిర్వహణ ♦ అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ప్లాంట్ నరసాపురం : దేశంలోనే మొదటిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నరసాపురంలో మల వ్యర్థ శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వచ్ఛాంధ్రమిషన్ పర్యవేక్షణలో వినియోగంలోకి రానున్న ఈ ప్లాంట్‌కు శానిటేషన్ రీసోర్స్పార్కుగా నామకరణం చేశారు. అక్టోబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మీ సెప్టిక్‌ట్యాంక్ నిండిందా అంటూ.. ఇళ్ల వద్దకు వచ్చి మలాన్ని తీసుకెళ్లే వారు. ఆ వ్యర్థాలను ఎవరూ చూడకుండా నదులు, కాలువల్లో కలిపేస్తున్నారు. దీంతో జలకాలుష్యం ప్రమాదస్థాయికి చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ముప్పును తప్పించడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, కేంద్రప్రభుత్వ స్వచ్ఛ భారత్ సంకల్ప్ సంకల్పించాయి. ఈ క్రమంలో మలవ్యర్థాలను శుద్ధి చేయడంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మలవ్యర్థం మొత్తం కార్బన్శాతం అత్యధికంగా ఉండే ఎరువుగా మారబోతుంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక అమెరికాలోని బిల్‌గేట్స్ సేవాసంస్థకు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మనదేశంలో మోడల్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించి జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు మునిసిపాలిటీల్లో ప్లాంట్స్ నెలకొల్పాలని నిర్ణయించారు. అయితే పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో స్థల సేకరణ జరగకపోవడంతో నరసాపురంలో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. బిల్‌గేట్స్ ఫౌండేషన్ ప్లాంట్ నిర్మాణానికి 1.20 కోట్ల నిధులు విడుదల చేసింది. స్వచ్ఛాంధ్ర మిషన్ పర్యవేక్షణలో పట్టణంలోని 15వ వార్డు గోదావరిగట్టున గత మే నెల 24వ తేదీన ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇటువంటి ప్లాంట్ అమెరికాలోనే ఉంది. ఆ తరహాలోనే ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు. అక్టోబర్ మొదటివారంలో ప్లాంట్‌ను వినియోగంలోకి తెస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ ఫౌండేషన్ వారు ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతను బెంగళూరుకు చెందిన టైడ్ టెక్నో క్రాప్ట్స్ ప్రైయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించారు. అంతేకాకుండా ప్లాంట్ నిర్వహణలో పలు అంతర్జాతీయ సేవాసంస్థలను భాగస్వాములను చేశారు. 15 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్‌లో మొత్తం నలుగురు పని చేస్తారు. ఎకరం స్థలంలో ప్లాంట్ నిర్మిస్తారు. 30 సెంట్ల స్థలంలో ప్లాంట్, మిగిలిన 70 సెంట్లలో పార్కును అభివృద్ధి చేస్తారు. ప్లాంట్‌కు రోడ్డు సౌకర్యం, మంచినీరు, విద్యుత్ సదుపాయం మాత్రమే మునిసిపాలిటీ అందించాల్సి ఉంటుంది. మిగిలిన నిర్వహణ అంతా టైడ్ టెక్నోక్రాప్ట్స్ సంస్థ ప్రతినిధులు చూసుకుంటారు. ఇలా పని చేస్తుంది సెప్టిక్‌ట్యాంకు నుంచి సేకరించి తీసుకొచ్చిన ఘన, ద్రవ వ్యర్థాలను ప్లాంట్‌లో దశలవారీగా శుభ్రం చేస్తారు. మొత్తం ప్రక్రియ 5 గంటల్లో పూర్తవుతుంది. ద్రవరూపంలో ఉండే మురుగు శుభ్రమైన నీరుగా మారుతుంది. ఘనరూపంలో ఉండే మలవ్యర్థాన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ప్లాంట్‌లో వేడి చేయడం ద్వారా వాటిలో ఉండే మలినాలు నాశనమవుతాయి. వివిధ ప్రక్రియల్లో శుభ్రం చేయడం ద్వారా తెల్లని పొడి రూపంలో ఉండే ఎరువుగా బయటకు వస్తుంది. శానిటేషన్‌లో ఇదో విప్లవం శానిటేషన్‌లో ఇదో విప్లవం. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లోనూ ఇటువంటి ప్లాంటులు నిర్మిస్తాం. ఇందులో తయారయ్యే ఎరువు మామూలు రసాయన ఎరువులు కంటే మంచిది. పాలకొల్లు, కొవ్వూరుల్లో కూడా ప్లాంటు ఏర్పాటుకు స్థలాలు దొరికాయి. మునిసిపాలిటీలకు ఖర్చు ఉండదు. –డాక్టర్ సీఎల్ వెంకటరావు, స్వచ్ఛాంధ్రమిషన్, ఏపీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మా పట్టణానికే గర్వకారణం బృహత్తర ప్రాజెక్ట్ దేశంలోనే ప్రయోగాత్మకంగా నరసాపురం పట్టణంలో పెట్టడం గర్వకారణం. ఇప్పటి వరకూ మలవ్యర్థాలను దొంగచాటుగా గోదావరిలో కలిపేస్తున్నారు. నది కలుషితం అవుతోంది. ఇక ఆ సమస్య ఉండదు –పి.రత్నమాల, మునిసిపల్ చైర్పర్సన్ చేతితో ముట్టుకునే పనిలేదు ప్లాంట్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణమవుతుంది. ప్లాంట్‌లో కేవలం నలుగురు సిబ్బంది ఉంటారు. మలవ్యర్థాన్ని చేతితో ముట్టుకునే పని ఉండదు. అంతా మిషన్ల ద్వారానే జరుగుతుంది. అసలు చుట్టు పక్కల వారికి కాలుష్యం అనే సమస్య ఉండదు. పైపెచ్చు ఇక్కడ తయారయ్యే ఎరువుతో పక్కన పార్కులో వివిధ రకాల మొక్కలు పెంచుతాం. పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో కూడా త్వరలో పనులు చేపడతాం. –పి.లక్ష్మీప్రసన్న, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అర్బన్ ప్లానర్ -
చెంచుల జీవన స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన సిందూరా గణపతి, నరెంధర్లతో కూడిన ఢిల్లీ బృందం సభ్యులు చెంచుల స్థితిగతులు జీవన విధానం, తదితర అంశాలపై అధ్యయనంలో భాగంగా నల్లమల లోతట్టు ప్రాంత చెంచు పెంటల్లో పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్లాపూర్‌లో ఐకేపీల ద్వారా 7.20 లక్షలు ఖర్చు చేసి ఉపాధి అవకాశంగా చెంచులకు ఇప్పించిన మేకలను, వాటి పోషణను సభ్యులు పరిశీలించారు. అనంతరం మన్ననూర్లోని చెంచు కమ్యూనిటీ భవనంలో చెంచు మహిళా గ్రూపు ప్రతినిధులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సంఘాల పొదుపు సంఘాల పనితీరు తదితర అంశాల గురించి ఇష్టాగోష్టిగా చర్చించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెంచుల అభివృద్ధి కోసం చేపట్టబోయే పలు నిర్ణయాలలో ఇక్కడ మంచి ఫలితాలను ఇచ్చిన పథకాలు అక్కడ రూపకల్పన చేయాలనేది ప్రధాన ఉద్దేశ్యమని బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీడీ సరోజ, యంగ్ ప్రొఫెషనల్ సభ్యులు లక్ష్మి, మల్లేష్, సంతోష్, పోతమ్మ, గురువమ్మ, మాసమ్మ తదితరులు పాల్గొన్నారు.