మానవీయ విలువలపై విద్యార్థులకు శిక్షణ
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 9 వరకూ శుభప్రదం కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి తెలిపారు. విలేకరులతో బుధవా
టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం
జూన్ 3 నుంచి 9 వరకూ ప్రత్యేక శిక్షణ
1000 మంది విద్యార్థులకు అవకాశం
జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ రామారెడ్డి
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 9 వరకూ శుభప్రదం కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి తెలిపారు. విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. శుభప్రదం శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మానవీయ, నైతిక విలువలు, ఆధ్యాత్మిక అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. లాలాచెరువు శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల ప్రాంగణంలో 500 మంది బాలికలకు, పెద్దాపురంలోని శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల ప్రాంగణంలో 500 మంది బాలురకు విడివిడిగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. 8, 9 తరగతుల విద్యార్థిని, విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. దరఖాస్తుల కోసం జిల్లాలోని అన్ని టీటీడీ కల్యాణ మంటపాలు, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వివరాలకు 9393051987 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జిల్లా ధర్మ ప్రచార మండలి కార్యదర్శి కె.సతీష్, సభ్యులు జి.నాగరాజు, కె.సత్యసాయిరామ్, చిట్టిబాబు, ఎన్.యోగి తదితరులు పాల్గొన్నారు.