ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
Published Fri, Apr 21 2017 11:19 PM | Last Updated on Wed, May 29 2019 2:49 PM
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం
–సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి
భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్‌చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఎల్‌కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్‌వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement