జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు జాహ్నవి
Published Sun, Dec 18 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
భానుగుడి (కాకినాడ):
తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జనవరి 3వ తేదీ నుంచి జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు రాజమహేంద్రవరం శ్రీ గౌతమి పబ్లిక్ స్కూల్ విద్యార్థి బి. జాహ్నవీదేవి ప్రదర్శన ఎంపికైంది. గత నెలలో కాకినాడలోని ఎంఎస్‌ఎ¯ŒS ఛార్టీస్ ఎయిడెడ్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన 6 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి సై¯Œ్స కాంగ్రెస్‌కు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయి పోటీలు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సీబీఆర్ విద్యా సంస్థల్లో నిర్వహించారు. ఆ పోటీల్లో అత్యుత్తమ పరిశోధనాత్మక ప్రాజెక్టుగా నిలిచిన బి. జాహ్నవీదేవి ప్రదర్శన ‘ఇంప్రోపర్ డిస్పోజల్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ 104వ ఇండియ¯ŒS సై¯Œ్స కాంగ్రెస్‌కు ఎంపికైంది.
బ్యాటరీలను వాడి పడేస్తే ప్రమాదమే
వాడివదిలేసిన బ్యాటరీల వలన కలిగే నష్టాలను జాహ్నవీదేవి తన ‘ ఇంప్రోపర్ డిస్పోజల్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ లో ప్రాజెక్టు రూపంలో సంక్షిప్త పరిచింది. బ్యాటరీలను కాల్చేయడం లేదా భూమిలో పాతిపెట్టడం వలన హానికర పొగ వాతావరణంలోకి విడుదలవుతుందని, దాంతో వాయుకాలుష్యం, రేడియో ధార్మిక పదార్థాలు భూమిలో కలవడం వలన భూమి కాలుష్యం పెరిగి ప్రజలకు ఆస్తా ్మ, ఇతర శ్వాస సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులు రావడాన్ని క్షేత్రస్థాయి పరిశీలనలతో ప్రాజెక్టులో జాహ్నవి ప్రవేశపెట్టింది. ఇండియ¯ŒS సై¯Œ్స కాంగ్రెస్‌కు ఎంపికయిన జాహ్నవిని డీఈఓ ఆర్.నరసింహారావు, జిల్లా సై¯Œ్స అధికారి జి.వసంతకుమార్, కో–ఆర్డినేటర్ కేసరి శ్రీనివాసరావు అభినందించారు.
అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా
ఇండియ¯ŒS సై¯Œ్స కాంగ్రెస్‌కు నా ప్రాజెక్టు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుకు మెరుగులు దిద్దుతున్నాను. ఇప్పటివరకు నాకు సహకరించిన అధ్యాపకులకు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు.
–బి.జాహ్నవీ దేవి, రాజమహేంద్రవరం
Advertisement
Advertisement