ప్రపంచంలోని చాలా దేశాలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'అమెజాన్' (Amazon) సంస్థ ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఆదరణ పెరుగుతున్న సమయంలో ఈ విభాగంలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి అమెజాన్ సన్నద్ధమైంది. ఏఐ రెడీ (AI Ready) ప్రోగ్రామ్ పేరుతో సంస్థ 2025 నాటికి సుమారు 20 లక్షల మందికి దీనిపైన ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది.
ఎనిమిది కోర్సులతో..
ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ వంటి దాదాపు ఎనిమిది కోర్సులతో ఏఐ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. రాబోయే రోజుల్లో మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సిద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పించింది.
ఇప్పటికే సుమారు రెండు కోట్ల కంటే ఎక్కువ మంది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్‌లో ట్రైనింగ్ పొందినట్లు అమెజాన్ వెల్లడించింది. కాగా, ఇప్పుడు ఏఐ రెడీ ప్రోగ్రామ్ ద్వారా 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. కేవలం యువతను మాత్రమే కాకుండా సీనియర్లకు కూడా దృష్టిలో ఉంచుకుని అమెజాన్ ఈ కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసింది.
వీరికే డిమాండ్
ఏఐ వల్ల ఉద్యోగులకు ముప్పు వాటిల్లుతుందని ఓ వైపు కొందరు చెబుతుంటే.. మరి కొందరు ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా కంపెనీలు ఏఐ గురించి తెలిసిన వారి కోసం వెతుకుతోంది. ఈ విభాగంలో నైపుణ్యం కలిగిన వారికి పెద్ద మొత్తంలో శాలరీలు ఇవ్వడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్
సుమారు 73 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు తెలిసిన వారికి జాబ్స్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యం అందిస్తోంది. నిజానికి ప్రతి నలుగురు కంపెనీ యజమానుల్లో ముగ్గురు ఏఐలో శిక్షణ ఉన్న వారి కోసం సర్చ్ చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మరింత ఉద్యోగావకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం పరిస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment