'బాబుతో నేను' కార్యక్రమానికి స్పందన కరువు | Babuto Nenu Program Is Getting Less Response From TDP Leaders, Details Inside - Sakshi
Sakshi News home page

'బాబుతో నేను' కార్యక్రమానికి స్పందన కరువు

Published Fri, Sep 15 2023 2:47 PM | Last Updated on Fri, Sep 15 2023 5:03 PM

Response To Babuto Nenu Program Is Lacking - Sakshi

అమరావతి: 'బాబుతో నేను' కార్యక్రమానికి టిడిపి నేతలు నుండి స్పందన కరువవుతోంది. కార్యక్రమానికి మద్దతు కోసం నేతలు పడరాని పాట్లు పడతున్నారు. 'బాబుతో నేను' కార్యక్రమంలో అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని అచ్చెం నాయుడు బహిరంగ లేఖ రాశారు. పాల్గొనని నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

కాగా, చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం అచ్చెన్నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌ ఆడియో లీకైంది. 

ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని అచ్చెన్నాయుడు నిట్టూర్పులు విడుస్తున్నారు.

ఇదీ చదవండి: అమావాస్యనాడు పవన్‌ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement