నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్ | NATS North Carolina Chapter Launches New Chapter | Sakshi
Sakshi News home page

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

Published Fri, Nov 1 2024 1:30 PM | Last Updated on Fri, Nov 1 2024 1:32 PM

NATS North Carolina Chapter Launches New Chapter

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అన్ని రాష్ట్రాల్లోనూ చాప్టర్లను ప్రారంభిస్తూ తెలుగువారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రంలో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. అపెక్స్ సీనియర్ సెంటర్‌లో నార్త్ కరోలినా చాప్టర్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నాట్స్ జాతీయ నాయకత్వం, నాట్స్ ఇతర చాప్టర్‌ల నుంచి వచ్చిన నాట్స్ నాయకులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

నార్త్ కరోలినా చాప్టర్ కోఆర్డినేటర్‌గా ఉమా నార్నెకు బాధ్యతలు అప్పగించారు. నార్త్ కరోలినా నాట్స్ చాప్టర్ సభ్యులుగా వేణు వెల్లంకి, రాజేష్ మన్నెపల్లి, రవితేజ కాజ, దీపికా దండు, కల్పన అధికారి, శ్రీను కాసరగడ్డ లు నాట్స్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని నాట్స్ దానికి తగ్గట్టే కార్యక్రమాలు చేపడుతూ తెలుగువారికి చేరువయ్యిందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ లక్ష్యాలను పిన్నమనేని వివరించారు. నాట్స్ అంటే అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రతి నాట్స్ సభ్యుడు, వాలంటీర్ కృషి ఎంతో ఉందని నాట్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ మధు కొర్రపాటి అన్నారు. 

నాట్స్ వైద్య శిబిరాలు, నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. నార్త్ కరోలినా లో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ ఉందనే భరోసాను నార్త్ కరోలినా నాట్స్ సభ్యులు, నాయకులు కల్పించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. తెలుగు వారిలో ఐక్యతను పెంపొందించి వారందరిని ఒక చోట కలిపే వేదికగా నాట్స్ ఎదిగిందని అదే తరహాలో నార్త్ కరోలినాలో కూడా ఇక్కడ నాట్స్ సభ్యులు తెలుగువారికి చేరువ కావాలని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ, సమాజ సేవే లక్ష్యాలుగా నార్త్ కరోలినా నాట్స్ విభాగం పనిచేయాలన్నారు. 

అందరితో కలిసి పనిచేస్తూ నాట్స్ ప్రతిష్టను పెంచాలని నాట్స్ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ వెబ్ చైర్ వెంకటేష్ కోడూరి, న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్ ఎగ్జిక్యూషన్ హరీష్ కొమ్మాలపాటి తదితరులు పాల్గొన్నారు. నవంబర్‌లో చేపట్టనున్న “థాంక్స్ గివింగ్ ఫుడ్ డ్రైవ్” కార్యక్రమంతో పాటు ఇతర క్రీడా పోటీల గురించి నార్త్  కరోలినా నాట్స్ టీం తెలిపింది. 

యువతలో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందించడం, మహిళా ఆరోగ్యంపై కార్యక్రమాలు, నిధుల సేకరణను ప్రోత్సహించడం, కొత్త దాతలు, వాలంటీర్లను ఆకర్షించడం, సోషల్ మీడియాలో ప్రచారం లాంటి అంశాలపై నాట్స్ నార్త్ కరోలినా టీం ప్రధానంగా చర్చించింది. నాట్స్ కొత్త చాఫ్టర్ తమ నగరంలో ప్రారంభం కావడంపై ఈ ప్రారంభ సభకు విచ్చేసిన నార్త్ కరోలినాలోని తెలుగు వారు హర్షం వ్యక్తం చేశారు.

(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్‌ అవగాహన సదస్సు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement