
ఎడిసన్, న్యూ జెర్సీ: భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది. భారతీయ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణం అమెరికాలోని తెలుగువారితో పాటు యావత్ ప్రవాస భారతీయులందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఓ ప్రకటనలో నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తెలిపారు. తామంతా లతామంగేష్కర్ పాటు వింటూ పెరిగామని అరుణ అన్నారు.
లతా జీ హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగి వస్తారని ఆశించామని.. కానీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరిని కలిచివేసిందని నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే పేర్కొన్నారు. లతా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నాట్స్ తెలిపింది. ఆమె కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది.
Comments
Please login to add a commentAdd a comment