
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. దీంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ జాబితాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేరింది. వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా విజయనంతరం నాట్స్ సంబరాల్లో మునిగి తేలారు.
అదే విధంగా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇతర టీం సభ్యులకు నాట్స్ అభినందనలు తెలిపింది.
అదే విధంగా భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించరాని నాట్స్ కొనియాడింది. మరోవైపు సంచలన క్యాచ్‌తో టీమిండియాను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను సైతం నాట్స్ పొగడ్తలతో ముంచెత్తింది. అతడి క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలో ఎప్పటికి గుర్తిండిపోతుందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment