విరాళం అందజేస్తున్న కాలనీవాసులు
కరీంనగర్ క్రైం : నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్ చొరవతో బ్యాంక్‌కాలనీ, మోహర్‌నగర్‌కాలనీవాసులు రూ.1.52లక్షల విరాళాన్ని శుక్రవారం సీపీ కమలాసన్‌రెడ్డి సమక్షంలో అందజేశారు. ఎస్సై మాధవరావు, బ్లూకోట్ సిబ్బంది శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్, కాలనీవాసులు మన్మోహన్‌రావు, సంజీవరావు, నర్సింగరావు పాల్గొన్నారు.
వాహనాల వేలం
వివిధ రకాల ప్రమాదాలు, సరైన ధ్రువపత్రాలు లేక పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నామని సీపీ తెలిపారు. మతిస్థిమితం కోల్పోయి మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం లేక్ పోలీసులు గుర్తించి ఆర్‌ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో దుస్తులు ధరింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment