అన్ని కోట్లు పోయినా..అంబానీయే...
అన్ని కోట్లు పోయినా..అంబానీయే...
Published Fri, Jun 2 2017 5:10 PM | Last Updated on Wed, Apr 3 2019 4:29 PM
దిగ్గజ టెలికం సంస్థగా వెలుగొందిన రిలయన్స్ కమ్యూనికేషన్ కుప్పకుప్పలుగా రుణభారం పెరిగిపోయిందని, ప్రత్యర్థి కంపెనీల నుంచి విపరీతమైన పోటీ వాతావరణం నెలకొందని ఇటీవల విపరీతంగా వార్తలొచ్చాయి. దీంతో రేటింగ్ ఏజెన్సీలు కూడా కంపెనీ బాండ్ల రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేశాయి. వీటన్నంటికీ తోడు నిరాశజనమైన ఆర్థిక ఫలితాలు.. కంపెనీ మార్కెట్ విలువను భారీగా దెబ్బతీశాయి. వైర్ లెస్ యూనిట్ షేర్లు 39 శాతం మేర పడిపోవడంతో దాన్ని మార్కెట్ విలువ రూ.3,310 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆర్ కామ్ దెబ్బతో ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మాత్రం ఇంకా ధనవంతుడిగానే కొనసాగుతున్నారని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది.
ఆయన నికర సంపద ఏకంగా 82 మిలియన్ డాలర్ల(రూ.528కోట్లు) నుంచి 2.7 బిలియన్లకు(రూ.17,400కోట్లకు) పెరిగినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ లో వెల్లడించింది. అంబానీకి చెందిన వైర్ లెస్ బిజినెస్ లు పడిపోయినప్పటికీ, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీగా వృద్ధి చెందినట్టు పేర్కొంది. ఇవి టెలికాం యూనిట్ బిజినెస్ లనుంచి వచ్చే ప్రభావాన్ని అధిగమించాయని తెలిపింది. అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ బిజినెస్ లు కూడా భారీగా ఆయుధాల కాంట్రాక్టులు పొందుతూ కొత్త లాభాదాయక పిల్లర్ గా మారుతున్నాయని రిపోర్టు చేసింది.
అయితే ఈ విషయంపై రిలయన్స్ గ్రూప్ అధికారప్రతినిధి ఇంకా స్పందించలేదు. 2002లో అంబానీ కుటుంబం టెలికాం పరిశ్రమలోకి ప్రవేశించింది. అనంతరం అనిల్, ముఖేష్ లు తమ ఆస్తులను పంచుకున్నారు. ప్రస్తుతం వీరు భారత్ లో అత్యంత ధనవంతులుగా వెలుగొందుతున్నారు. కానీ ఇటీవల అన్న ముఖేష్ కు చెందిన జియోతో తమ్ముడి ఆర్ కామ్ బిజినెస్ లు దెబ్బతింటున్నాయి.
Advertisement
Advertisement