దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్ | Reliance Communications rolls out free national roaming offers | Sakshi
Sakshi News home page

దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్

Published Tue, Jun 10 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్

దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్

  •  లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌కు ఒకే రేటు
  •  ఆర్‌కామ్ వన్ ఇండియా-వన్ రేట్ ప్లాన్స్
  •  న్యూఢిల్లీ: లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌కు అన్నింటికీ ఒకటే రేటు వర్తించే వన్ ఇండియా వన్ రేట్ ప్లాన్స్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం ప్రారంభించింది. భారత్‌లో లోకల్ కాల్స్, ఎస్‌టీడీ కాల్స్, రోమింగ్‌కు ఉన్న వివిధ టారిఫ్‌లన్నింటిని తొలగించి అన్నింటికి ఒకే రేటు ఉండే వన్ ఇండియా, వన్ ప్లాన్స్‌ను అందిస్తున్నామని ఆర్‌కామ్ సీఈవో(కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ తెలిపారు. ఈ ప్లాన్‌ల్లో భాగంగా పోస్ట్-పెయిడ్ యూజర్ల కోసం రూ.350, రూ.599 ప్లాన్‌లను, ప్రి-పెయిడ్ కస్టమర్లకు రూ.45 ప్యాక్‌ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
     
    ఈ ప్లాన్‌లలో రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితమని, లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌కు ఒకే టారిఫ్ ఉంటుందని పేర్కొన్నారు. రూ.599 ప్లాన్‌లో 1,200 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్(రోమింగ్, ఎస్‌టీడీ, లోకల్) ఉచితమని, 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితమని వివరించారు. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 30 పైసలు కాల్‌చార్జీ ఉంటుందని వివరించారు.

    ఇక రూ.350 ప్లాన్‌లో 700 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 200 నిమిషాలు ఇన్‌కమింగ్ నేషనల్ రోమింగ్, అలాగే 1 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు..ఇవన్నీ ఉచితమని పేర్కొన్నారు. ఉచిత కాల్స్ అయిపోయిన తర్వాత నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు. ఇక రూ.45 ప్యాక్ ఒక నెల వ్యాలిడిటీ ఉంటుందని, రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితమని, అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement