Local calls
-
ఆదాయానికి గండి...
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ముఠాను ఫలక్‌నుమా పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వీరి నిర్వాకంతో తమకు రూ.1.44 కోట్ల నష్టం వాటిల్లిందని టెలికాం శాఖ ఫిర్యాదు చేసింది. అయితే నగరంలో తరచూ వెలుగులోకి వస్తున్న ఈ తరహా దందాలతో కేవలం ప్రభుత్వానికి ఆర్థిక నష్టమే కాకుండా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, నిఘా వర్గాలు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇంటర్నేషనల్ కాల్ వచ్చేది ఇలా... విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజ్ నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడి నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఈ ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఆ మొత్తం ఎగ్గొట్టడానికే... ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతా విదేశాల్లోనే ఉంటారు. కొందరు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్లాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్ల వద్ద ఉంటాయి. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. రూటింగ్ ఇలా... విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొందరికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటైన తరువాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారితో ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి వద్ద ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి లేదా ఇతరుల పేర్లతో తీసుకున్న వాటిని వినియోగించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ఈ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్ తగ్గుతుంది. దేశంలోని పలువురు ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు దెబ్బతింటున్నాయి. ఇలా దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్ అందజేస్తారు. ఈ కారణంగానే ప్రాధాన్యం... ప్రధానంగా పాకిస్థాన్... మరికొన్ని దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారులను ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు.కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. ఫోన్ వచ్చిన నంబర్‌కు కాల్ బ్యాక్ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్ ద్వారానే దీనికి పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. -
ఓన్లీ ఇన్ కమింగ్..!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్ గోయింగ్) బయటి దేశాలకు పంపలేవు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటి మాత్రమే లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్కమింగ్) అందించగలవు. నగరంలోని మూడు చోట్ల అక్రమ ఎక్ఛ్సేంజ్‌లు ఏర్పాటు చేసి, రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ మొత్తం ఎగ్గొట్టడానికే... విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకోవడానికి అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతూ విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. రూటింగ్ జరిగేది ఇలా... విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటయిన తరవాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారిని ఎరవేసి ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లను రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటున్నాయి. ఈ కారణంగానే ప్రాధాన్యం... ఆదివారం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ముఠాకు సంబంధించిన సమాచారం వారికి నిఘా వర్గాల నుంచి అందింది. పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు.అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపి స్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. -
ఓన్లీ..ఇన్కమింగ్
►కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు కాల్స్ పంపలేవు ►సూత్రధారి మతీన్‌పై గతంలోనూ పలు కేసులు ►హార్డ్‌డిస్క్ పునరుద్ధరించాకే స్పష్టత: సీసీఎస్ డీసీపీ సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను బయటి దేశాలకు పంపలేవని (ఔట్ గోయింగ్) అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటికి లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి అందించగలవని (ఇన్కమింగ్) వివరిస్తున్నారు. కాల్ రూటింగ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన తండ్రీకొడుకులు అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీలను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లోని ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మతీనుద్దీన్పై అనేక కేసులు హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆఘాపురలో అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీలతో కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్ను ఏర్పాటు చేయించింది రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మతీనుద్దీన్ అలియాస్ మతీన్‌గా పోలీసులు నిర్థారించారు. ఇతను గతంలోనూ ఇలాంటి దందాలు చేసి పోలీసులకు చిక్కాడు. సీసీఎస్లోనూ మతీన్‌పై కాల్ రూటింగ్ ఆరోపణలతో కేసు నమోదై ఉంది. కొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీ ఇంటిపై దాడులు నిర్వహించేందుకు వెళ్లగా పోలీసులు ఇంట్లోకి రాకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు ఆపారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్థానిక పోలీసులు, బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు అప్రమత్తమైన నిందితులు తమ ల్యాప్‌టాప్‌తో పాటు ఓ కంప్యూటర్ను ధ్వంసం చేశారు. వీటి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరికి చేరాయి? అనే దానిపై స్పష్టత వస్తుందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిందితుల నుంచి 64 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో సహకరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ) సహకారం తీసుకుంటున్నామన్నారు. ఆ కారణంగానే ప్రాధాన్యం... పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. ఇందుకుగాను వారు వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల అధికారులకు కొన్ని రకాలైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ బ్యాక్ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్ ద్వారానే దీనికి పాల్పడ్డారు. అలాంటి రూటింగ్ కాల్స్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఆరా తీస్తున్న సమయంలోనే ఈ గ్యాంగ్ చిక్కింది. దీనికితోడు అహ్మద్ సిద్ధిఖీ రెండు పాస్పోర్ట్స్ కలిగి ఉండటం, ఒకదాన్ని వినియోగించి 2004లో పాకిస్థాన్‌కు వెళ్ళి రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిని లోతుగా విచారించడానికి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
‘కాల్’ కంత్రీలు
అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌గా మళ్లింపు తక్కువ ధరలకు అందిస్తున్న ముఠా అరెస్ట్ రాంగోపాల్‌పేట్ : అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మళ్లిస్తున్న ముఠాను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్ కేసు వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీ ప్రశాంత్ అపార్ట్మెంట్లో నివసించే కృష్ణ చైతన్య(29) బీటెక్ పూర్తి చేశాడు. ఆగాపూరకు చెందిన గడ్డం రాజ్సాయి రాహుల్ కుమార్(28), అదే ప్రాంతానికి చెంది పిట్లం రామకృష్ణ(27), సిద్ధార్థ(24), షేక్‌పేట్ మారుతీనగర్‌కు చెందిన పిట్ల అనురూప్ స్నేహితులు. వీరు ముఠాగా ఏర్పడి ఆసిఫ్‌నగర్, హాంక్‌కాంగ్‌లో కృష్ణ చైతన్య ఎండీగా, డీవీఎల్ గ్రూప్ (డిజిటల్ వాయిస్ ల్యాబ్ గ్రూప్) అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే హైదర్షాకోట్లో దేశి వాయిస్ మొబైల్ ల్యాబ్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ఈ ముఠా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ (ఐఎస్టీడీ)ను ఇంటర్నెట్ ద్వార లోకల్ కాల్స్‌గా మార్చి తక్కువ ధరలకు వివిధ సంస్థలకు, వ్యక్తులకు అందిస్తున్నారు. ఐఎస్టీడీ కాల్స్‌ను లెసైన్సు కలిగిన కొన్ని టెలికాం సంస్థలు మాత్రమే గేట్ వే ద్వార పంపిస్తుంటారు. ఈ కాల్స్ ఎక్కడి నుంచి ఎవరికి వెళుతున్నాయి అనేది నమోదు అవుతుంది. కానీ ఈ సంస్థ ఢిల్లీ నుంచి వీఓఎస్ అనే సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి, ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను మళ్లిస్తున్నాయి. దీంతో లెసైన్సు కలిగిన టెలికాం సంస్థలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా వీరి ద్వార వెళ్లే కాల్స్‌ను గుర్తించడం కష్టం. వీటికి కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ లేకపోవడంతో తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశాలుంటాయి. ఇది జాతీయ భద్రతకు కూడా చాలా ముప్పు ఉంటుంది. నిందితులు కొన్ని సంస్థలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని వారికి తక్కువ ధరలకే అంతర్జాతీయ కాల్స్‌ను అందిస్తున్నాయి. అలాగే నెట్లో యాడ్స్ ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి కార్యాలయాలపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సీపీయూలు, ఐదు మొబైల్ ఫోన్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ధర్యాప్తు కోసం ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మరో నిందితుడు అనుదీప్ పరారీలో ఉన్నారు. -
దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్
లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌కు ఒకే రేటు ఆర్‌కామ్ వన్ ఇండియా-వన్ రేట్ ప్లాన్స్ న్యూఢిల్లీ: లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌కు అన్నింటికీ ఒకటే రేటు వర్తించే వన్ ఇండియా వన్ రేట్ ప్లాన్స్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం ప్రారంభించింది. భారత్‌లో లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌కు ఉన్న వివిధ టారిఫ్లన్నింటిని తొలగించి అన్నింటికి ఒకే రేటు ఉండే వన్ ఇండియా, వన్ ప్లాన్స్‌ను అందిస్తున్నామని ఆర్‌కామ్ సీఈవో(కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ తెలిపారు. ఈ ప్లాన్‌ల్లో భాగంగా పోస్ట్-పెయిడ్ యూజర్ల కోసం రూ.350, రూ.599 ప్లాన్లను, ప్రి-పెయిడ్ కస్టమర్లకు రూ.45 ప్యాక్‌ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్లాన్లలో రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని, లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు ఒకే టారిఫ్ ఉంటుందని పేర్కొన్నారు. రూ.599 ప్లాన్‌లో 1,200 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్(రోమింగ్, ఎస్టీడీ, లోకల్) ఉచితమని, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితమని వివరించారు. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 30 పైసలు కాల్చార్జీ ఉంటుందని వివరించారు. ఇక రూ.350 ప్లాన్‌లో 700 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 200 నిమిషాలు ఇన్కమింగ్ నేషనల్ రోమింగ్, అలాగే 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు..ఇవన్నీ ఉచితమని పేర్కొన్నారు. ఉచిత కాల్స్ అయిపోయిన తర్వాత నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు. ఇక రూ.45 ప్యాక్ ఒక నెల వ్యాలిడిటీ ఉంటుందని, రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని, అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు.