R Com
-
అనిల్ అంబానీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీసుకున్న 680 మిలియన్ డాలర్ల కార్పొరేట్ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్ దరఖాస్తును బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి చేయజాలవని అంబానీ చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్ 7న దీనిపై విచారణ జరిగిందని, సోమవారం ఉత్తర్వులు వచ్చాయని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి తెలిపారు. -
సెప్టెంబర్ 30లోగా రూ.550 కోట్లు చెల్లించాలి
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎరిక్సన్ ఇండియా మధ్య బకాయిల విషయమై కుదిరిన అంగీకారానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. సెప్టెంబర్ 30లోగా ఎరిక్సన్కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించాలని అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆర్‌కామ్ టెలికం నెట్వర్క్ నిర్వహణ కోసం ఆ సంస్థతో ఎరిక్సన్ 2014లో ఏడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ, తమ బకాయిలను ఆర్‌కామ్ చెల్లించలేదంటూ ఎరిక్సన్ న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. ఎరిక్సన్ ఇండియాకు రూ.550 కోట్లను చెల్లించేందుకు ఆర్‌కామ్ అంగీకరించడంతో ఆ కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలపై స్టే విధిస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఈ ఏడాది మే 30న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. -
దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్
లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌కు ఒకే రేటు ఆర్‌కామ్ వన్ ఇండియా-వన్ రేట్ ప్లాన్స్ న్యూఢిల్లీ: లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌కు అన్నింటికీ ఒకటే రేటు వర్తించే వన్ ఇండియా వన్ రేట్ ప్లాన్స్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం ప్రారంభించింది. భారత్‌లో లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌కు ఉన్న వివిధ టారిఫ్లన్నింటిని తొలగించి అన్నింటికి ఒకే రేటు ఉండే వన్ ఇండియా, వన్ ప్లాన్స్‌ను అందిస్తున్నామని ఆర్‌కామ్ సీఈవో(కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ తెలిపారు. ఈ ప్లాన్‌ల్లో భాగంగా పోస్ట్-పెయిడ్ యూజర్ల కోసం రూ.350, రూ.599 ప్లాన్లను, ప్రి-పెయిడ్ కస్టమర్లకు రూ.45 ప్యాక్‌ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్లాన్లలో రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని, లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు ఒకే టారిఫ్ ఉంటుందని పేర్కొన్నారు. రూ.599 ప్లాన్‌లో 1,200 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్(రోమింగ్, ఎస్టీడీ, లోకల్) ఉచితమని, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితమని వివరించారు. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 30 పైసలు కాల్చార్జీ ఉంటుందని వివరించారు. ఇక రూ.350 ప్లాన్‌లో 700 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 200 నిమిషాలు ఇన్కమింగ్ నేషనల్ రోమింగ్, అలాగే 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు..ఇవన్నీ ఉచితమని పేర్కొన్నారు. ఉచిత కాల్స్ అయిపోయిన తర్వాత నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు. ఇక రూ.45 ప్యాక్ ఒక నెల వ్యాలిడిటీ ఉంటుందని, రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని, అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు.