
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎరిక్సన్ ఇండియా మధ్య బకాయిల విషయమై కుదిరిన అంగీకారానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. సెప్టెంబర్ 30లోగా ఎరిక్సన్‌కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించాలని అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆర్‌కామ్ టెలికం నెట్‌వర్క్ నిర్వహణ కోసం ఆ సంస్థతో ఎరిక్సన్ 2014లో ఏడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ, తమ బకాయిలను ఆర్‌కామ్ చెల్లించలేదంటూ ఎరిక్సన్ న్యాయపోరాటం చేసి విజయం సాధించింది.
ఎరిక్సన్ ఇండియాకు రూ.550 కోట్లను చెల్లించేందుకు ఆర్‌కామ్ అంగీకరించడంతో ఆ కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలపై స్టే విధిస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఈ ఏడాది మే 30న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment