
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీసుకున్న 680 మిలియన్ డాలర్ల కార్పొరేట్ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్ దరఖాస్తును బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి చేయజాలవని అంబానీ చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్ 7న దీనిపై విచారణ జరిగిందని, సోమవారం ఉత్తర్వులు వచ్చాయని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment