China banks
-
Bao Fan: చైనా బ్యాంకర్ మిస్సింగ్ సంచలనం! ఇంతకీ ఎవరతను?
చైనాలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు. తాజాగా చైనా ప్రముఖ బ్యాంకర్ బావో ఫాన్ అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. బావోఫాన్ను సంప్రదించలేకపోతున్నట్టు బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ చైనా రినయిసెన్స్ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వంటనే ఆ కంపెనీ షేర్ ధర 50 శాతం పడిపోయింది. ఈ సంస్థలో అవినీతిపై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బావోఫాన్ కనిపించకుండా పోవడం వెనుక ఆ దేశ ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న చైనాలో వ్యాపార దిగ్గజాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్తలు ఇలా కనిపించకుండా పోవడం కొత్తేమీ కాదు. బావో ఫాన్‌కు ముందు కూడా అనేకమంది ఉన్నత వ్యాపార నిర్వాహకులు గల్లంతయ్యారు. 2015లోనే కనీసం ఐదుగురు అదృశ్యమయ్యారు. వాస్తవానికి బావోకు కొన్ని రోజుల ముందు, రియల్ ఎస్టేట్ సంస్థ సీజెన్ గ్రూప్ వైస్ చైర్మన్ కనిపించకుండా పోయారు. కొంతకాలం క్రితం చైనా టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్‌మా గల్లంతయ్యారు. ఎవరీ బావోఫాన్? చైనాలో ప్రఖ్యాతిగాంచిన బ్యాంకర్లలో బావోఫాన్ ఒకరు. షాంఘై నగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చైనా ప్రభుత్వంలో పనిచేసేవారు. అయినప్పటికీ అమెరికాలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు బావోఫాన్. షాంఘైలోని ఫుడన్ యూనివర్సిటీ, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి డిగ్రీలు పొందారు. 1990వ దశకంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూయిస్ గ్రూప్‌ల కోసం పనిచేశాడు. అనంతరం షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో అడ్వయిజర్‌గా పని చేశారు. 2005లో కేవలం ఇద్దరితో చైనా రినయిసెన్స్ను ప్రారంభించారు. వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్‌రైటింగ్, సేల్స్, ట్రేడింగ్‌లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఏకంగా 346 మిలియన్ల డాలర్లను సేకరించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మీటువాన్-డయాన్పింగ్, ట్రావెల్ సంస్థలు సీ ట్రిప్-క్యూనర్ విలీనాల్లో బావోఫాన్ కీలక పాత్ర పోషించారు. పలు నివేదికల ప్రకారం.. బావోఫాన్ నికర విలువ సుమారు 1.7 బిలియన్ డాలర్లు. -
ఎగబడి లోన్లు ఇచ్చిన బ్యాంక్.. చివరికి ‘చెత్త’ ఘనత
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్‌గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్‌ను తగిలించాయి చివరికి!. చైనాకు చెందిన మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్‌గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్‌షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది. బ్లూమ్‌బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్‌గా నిలిచింది మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్‌బర్గ్. పైకి.. ఆపై పతనం 1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్‌షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్‌గ్రాండ్‌కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్‌షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది. సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు! -
అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ
-
రంగంలోకి బ్యాంకులు : చిక్కుల్లో అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మరోఎదురు దెబ్బ తగిలింది. 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలపై మూడు చైనా బ్యాంకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా బ్యాంకులు ఇప్పుడు అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను వివరాలను అంచనా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి. తమకు రావాల్సిన రుణ బకాయిలకోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్నిమార్గాలను ఉపయోగించుకుంటామని ప్రకటించాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు తప్పవని భావిస్తున్నారు. (కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ) అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అంబానీ పర్సనల్ గ్యారంటీతో, చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. కానీ దివాలాతీసిన ఆర్‌కామ్ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించగా, చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22 న కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే తన దగ్గర చిల్లిగవ్వలేదనీ, బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. కోర్టు ఫీజుల కోసం తనభార్య నగలు అమ్మి, అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నానంటూ తాజాగా వాదించిన సంగతి తెలిసిందే. అయితే అంబానీ వాదనతో విబేధిస్తున్న బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. -
చైనా బ్యాంకులకు వ్యక్తిగత హామీ ఇవ్వలేదు
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మూడు చైనా బ్యాంకుల నుంచి 2012లో తీసుకున్న రుణాలకు తాను ఎటువంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేదని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరోసారి స్పష్టం చేశారు. అనిల్ అంబానీకి వ్యతిరేకంగా చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించగా.. వ్యక్తిగత హామీ ఇచ్చినందుకు చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5వేల కోట్లకుపైగా) చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్బీఐ సైతం ఆర్‌కామ్ రుణానికి సంబంధించి వ్యక్తిగత హామీ ఇచ్చిన అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లు వసూలు చేసుకునేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించింది. ఈ విషయాలపై రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ కంపెనీల వాటాదారుల వార్షిక సమావేశంలో (ఆన్లైన్ ద్వారా నిర్వహించారు) అనిల్ అంబానీ స్పష్టతనిచ్చారు. ఈ రెండు కేసుల్లోనూ (ఎస్బీఐ, చైనా బ్యాంకులు) రుణాలను గ్రూపు కంపెనీ (ఆర్‌కామ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్) తీసుకున్నవే కానీ, తనకోసం కాదని అనిల్ పేర్కొన్నారు. చైనీ బ్యాంకులతో నాన్ బైండింగ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్ కుదుర్చుకునేందుకు తాను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చానే కానీ, హామీపై సంతకం చేయలేదని చెప్పారు. ఆర్‌కామ్ దివాలా కేసులో తుది ఫలితం ఆధారంగా చైనా బ్యాంకులకు ఎంత ఇచ్చేదీ తేలుతుందన్నారు. వాటాలు పెంచుకుంటాం: గ్రూపు కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్లో ప్రమోటర్లు వాటాల పెంచుకోవాలని నిర్ణయించినట్టు అనిల్ అంబానీ వాటాదారులకు తెలిపారు. మార్చి నాటికి రిలయన్స్ పవర్లో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 19.29 శాతం వాటా ఉండగా, రిలయన్స్ ఇన్ఫ్రాలో 14.7 శాతం మిగిలి ఉంది. -
అనిల్.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి
లండన్ : రుణ ఒప్పందంలో భాగంగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 717 మిలియన్ డారల్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 5446 కోట్లు) 21 రోజుల్లోగా చెల్లించాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి శుక్రవారం యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2012 లో రిలయన్స్ కామ్ మూడు చైనీస్ బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి అనిల్ అంబానీ తన వ్యక్తిగత హామీని సమర్పించారు. కాగా సంస్థ ఇప్పుడు దివాలా తీర్పులో ఉండడంతో వడ్డీతో తిరిగి పొందాలని బ్యాంకులు దావా వేసిన రుణంపై డిఫాల్ట్ అవడంతో సదరు బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. కాగా రిలయన్స్‌కు రుణం ఇచ్చిన మూడు చైనా బ్యాంకుల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ముంబై బ్రాంచ్), చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు ఉన్నాయి.(అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు) లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉండడంతో లండన్ హైకోర్టులోని వాణిజ్య విభాగంలో జస్టిస్ నిగెల్ రిమోట్ హియరింగ్ ద్వారా శుక్రవారం విచారణ చేపట్టారు. రుణం తీసుకున్నప్పుడు అనిల్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ తీర్పునిచ్చారు. నిగెల్ చదివిన తీర్పులో హామీ యొక్క 3.2 నిబంధన ప్రకారం, రిలయన్స్ కామ్ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో హామీ ఇచ్చిన వ్యక్తే దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది దివాల చర్య చట్టం కింద వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. 21 రోజుల్లోగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకావం ఉందంటూ తీర్పునిచ్చారు. కాగా ఇంతకుముందు జరిగిన విచారణలో అంబానీ వాదనను కోర్టు తోసిపుచ్చింది.ప్రస్తుతం అనిల్ నికర విలువ సున్నాగా ఉండడంతో అతని కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు పొందే అంశంపై కోర్టు నిరాకరించింది. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక) -
అనిల్ అంబానీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీసుకున్న 680 మిలియన్ డాలర్ల కార్పొరేట్ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్ దరఖాస్తును బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి చేయజాలవని అంబానీ చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్ 7న దీనిపై విచారణ జరిగిందని, సోమవారం ఉత్తర్వులు వచ్చాయని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి తెలిపారు. -
అనిల్ అంబానీపై మరో పిడుగు
సాక్షి, ముంబై : అప్పులు, దివాలా ఊబిలో కూరుకుపోయి అస్తులను అమ్ముకుంటున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన పలు బ్యాంకులు ఆర్‌కాం బకాయిలకు సంబంధించి కనీసం 2.1 బిలియన్ డాలర్లు అప్పు కట్టాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఇప్పటికే భారీగాసంపదను కోల్పోయి ప్రపంచ బిలియనీర్ల జాబితాలోంచి కిందికి పడిపోయిన అనిల్ అంబానీ నెత్తిన మరో పిడుగు పడినట్టైంది. చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి అప్పులు ఇచ్చాయి. ప్రస్తుతం ఇవి అప్పులను రాబట్టేందుకు సిద్ధమయ్యాయి. జూన్ 13 నాటికి ఏడు టాప్ బ్యాంకులకు కంపెనీలు చెల్లించాల్సిన రుణాల వివరాలు ఇలా ఉన్నాయి. చైనా ప్రభుత్వరంగ బ్యాంకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్.. రూ.9,860 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు). ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్లుగా ఉంది. దీనికితోడు దేశీయంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ. 4910 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 2 700 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 2090 కోట్లు మాడిసన్ పసిఫిక్ ట్రస్ట్‌కు రూ.2350 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తం అప్పులు రూ.57,382 కోట్లుగా ఉంది. ఇది కాకుండా రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యాకు రూ.511 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్‌కాంగ్) డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్‌లతో పాటు ఇతరులకు బకాయిలు పేరుకుపోయాయి. రుణాలకు సంబంధించిన వివరాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం విడుదల చేసింది. కాగా ఆర్‌కామ్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో మధ్య రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి సిద్ధమయ్యాయి. కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ డీల్‌కు బ్రేక్‌పడింది. ఇది ఇలా వుంటే ఆస్తులు అమ్మి అయినా మొత్తం అప్పులు తీర్చేస్తామని ఇటీవల అనిల్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
35 వేలమంది ఉద్యోగులపై వేటు
బీజింగ్ : బ్యాంకుల ఆదాయం మందగించడం ఉద్యోగులకు ముప్పుగా మారింది. చైనాలోని అతిపెద్ద బ్యాంకుల ఆదాయ వృద్ధి తగ్గిపోవడంతో వ్యయాలను తగ్గించుకోవడానికి దాదాపు 35 వేలమంది ఉద్యోగులపై వేటు వేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో బ్యాంకు లాభాలు ఫ్లాట్‌గా నమోదవడంతో పాటు మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో బ్యాంకులు ఉద్యోగుల కోతతో వ్యయ భారాన్ని తగ్గించుకుంటున్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టు చేసింది. అంతేకాక రుణదాతలకు వడ్డీరేటు మార్జిన్లు కూడా పడిపోయాయని ఈ నివేదిక తెలిపింది. చైనాలో 19 లిస్టెడ్ బ్యాంకుల్లో, ఏడు బ్యాంకులు ముందటి ఆరు నెలల కాలంతో పోలిస్తే జూన్‌తో ముగిసిన ఈ ప్రథమార్థంలో తమ ఉద్యోగుల శాతాన్ని తగ్గించుకున్నట్టు రిపోర్టు చేశాయి. ఆరు అతిపెద్ద బ్యాంకుల్లో ఐదు ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం 34,691 ఉద్యోగులను తీసేసినట్టు బ్యాంకుల త్రైమాసిక ఫైనాన్సియల్ స్టేట్మెంట్లలో వెల్లడైనట్టు విండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. అదేవిధంగా చైనా తరహాలోనే యూరోపియన్, అమెరికాలో 11 అతిపెద్ద బ్యాంకులు కూడా 100,000 ఉద్యోగులపై వేటు వేసినట్టు ఫైనాన్సియల్ టైమ్స్ విశ్లేషకులు వెల్లడించారు. ఫ్లాట్‌గా వస్తున్న ఆదాయాల నుంచి తప్పించుకోవడానికి లేదా సానుకూల ఆదాయాల వృద్ధి బాటలో నడవడానికి బ్యాంకులు ఆపరేటింగ్ వ్యయాలను నియంత్రిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు వ్యవస్థలో ఎక్కువగా లావాదేవీలు జరుగుతుండటంతో కూడా బ్యాంకులు ఉద్యోగుల శాతాన్ని తగ్గించుకోవడానికి ఓ కారణంగా వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో 90 శాతానికి పైగా లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయని, కమర్షియల్ బ్యాంకుల ఐటీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వ్యవస్థలను బ్యాంకులు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టు చేసింది.