82 లక్షలు పెరిగిన జీఎస్‌ఎం కనెక్షన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జీఎస్‌ఎం మొబైల్ కనెక్షన్ల సంఖ్య మార్చ్‌లో 82.6 లక్షలు పెరిగి 72.19 కోట్లకు చేరుకుంది. క్రితం నెలతో పోలిస్తే ఇది 1.16 శాతం పెరుగుదల. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ సబ్‌స్క్రయిబర్స్ వివరాలు లేవు. ఈ రెండూ కూడా జీఎస్‌ఎం సర్వీసులు ఇస్తున్నప్పటికీ.. గణాంకాలను సీవోఏఐకి నివేదించకపోవడమే ఇందుకు కారణం. అత్యధికంగా ఐడియా సెల్యులర్ కనెక్షన్లు 22.3 లక్షలు) పెరగ్గా, వొడాఫోన్ (22.2 లక్షలు), ఎయిర్‌టెల్ (18.9 లక్షలు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నవంబర్ నుంచి జీఎస్‌ఎం కనెక్షన్లు పెరుగుతూ వచ్చినా.. మార్చ్‌లో మాత్రం తగ్గడం గమనార్హం. ఫిబ్రవరిలో సుమారు 1.02 కోట్ల కొత్త కనెక్షన్లు వచ్చాయి