సెప్టెంబర్‌లో తగ్గిన మొబైల్ యూజర్లు | Mobile users fall 0.7 present in Sept to 870.6 million | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో తగ్గిన మొబైల్ యూజర్లు

Published Wed, Nov 6 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

Mobile users fall 0.7 present in Sept to 870.6 million

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్‌లో తగ్గిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. గత 5 నెలల్లో ఈ వినియోగదారుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. ట్రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం...
 

  •      ఈ ఏడాది ఆగస్టు నాటికి 87.67 కోట్లుగా ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.70%తగ్గి 87.05 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో యూజర్ల సంఖ్య 10 లక్షలు తగ్గింది.
  •      ఆర్‌కామ్ సంస్థ 1.04 కోట్ల వినియోగంలోలేని కనెక్షన్‌లను తొలగించింది. దీంతో మొత్తం 11.62 కోట్ల యూజర్లతో(13.35 మార్కెట్ వాటా)తో ఈ కంపెనీ నాలుగో స్థానానికి పడిపోయింది.
  •      మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా 90.61 కోట్ల నుంచి 0.70% తగ్గి 89.98 కోట్లకు పడిపోయింది.
  •      ఐడియా సెప్టెంబర్‌లో 12.07 లక్షల మంది కొత్త యూజర్లను జతచేసుకోవడంతో మొత్తం యూజర్ల సంఖ్య 12.72 కోట్లకు పెరిగింది.
  •      12.05 లక్షల కొత్త మొబైల్ యూజర్లతో వొడాఫోన్ మొత్తం సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 15.55 కోట్లకు పెరిగింది.
  •      భారతీ ఎయిర్‌టెల్‌కు 11.64 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. 22.21% మార్కెట్ వాటా(19.33 కోట్ల మంది వినియోగదారుల)తో అగ్రస్థానంలో నిలిచింది.
  •      మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కోసం 22.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
  •      దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 1.52 కోట్ల నుంచి 0.52 శాతం వృద్ధితో 1.53 కోట్లకు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement