న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా అండ్ బ్యాంక్రప్టసీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కోరింది. రిలయన్స్ క్యాపిటల్ బాండ్లలో ఈపీఎఫ్‌వో రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై 2019 అక్టోబర్ నుంచి చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమవుతూ వచ్చినట్టు వివరించారు.
ఈపీఎఫ్‌వోకు అసలు పెట్టుబడి, వడ్డీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైందా? అంటూ ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ జా అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2021 నవంబర్ 30 నాటికి ఎన్‌సీడీలపై రిలయన్స్ క్యాపిటల్ రూ.534 కోట్ల వడ్డీని చెల్లించడంలో వైఫల్యం చెందినట్టు చెప్పారు. అసలు వడ్డీతో కలిసి సుమారు రూ.3,000 కోట్లు ఈపీఎఫ్‌వో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ ఆర్‌బీఐ ఇటీవలే ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment