![RBI Started Insolvency Procedure On Anil Ambani Reliance Capital - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/30/RBI.jpg.webp?itok=bRykFVI7)
ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. బకాయిల ఎగవేతలు, తీవ్రమైన గవర్నెన్స్ సమస్యల నేపథ్యంలో త్వరలోనే కంపెనీ దివాలా ప్రక్రియ చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఈడీ నాగేశ్వర రావును సంస్థ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించినట్లు వివరించింది.
మరోవైపు, దివాలా చట్టం కింద రుణ సమస్యను పరిష్కరించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్‌క్యాప్ తెలిపింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌క్యాప్ రుణభారం సెప్టెంబర్ ఆఖరు నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 40,000 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ రూ. 6,001 కోట్ల ఆదాయంపైరూ.1,156 కోట్ల నష్టం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment