అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ (ఆర్‌పవర్) షేర్ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. ఆ కంపెనీ షేర్లు గత తొమ్మిది సెషన్‌లలో 55 శాతం ర్యాలీ చేశాయి. సెప్టెంబర్ 17న రూ. 31.40 ముగింపు ధర నుండి ఆర్‌పవర్ షేర్లు వరుసగా తొమ్మిది రోజులు ఎగువ సర్క్యూట్‌లను తాకాయి.
నిధుల సమీకరణకు సంబంధించి అక్టోబర్ 3న కంపెనీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో కంపెనీ షేర్లకు ఊపు వచ్చింది. సెప్టెంబర్ 30న ఆర్‌పవర్ షేర్లు దాని మునుపటి ముగింపు రూ. 46.35కి వ్యతిరేకంగా ఒక్కొక్కటి రూ. 46.25 వద్ద ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభమైన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్టాక్ దాదాపు 5 శాతం క్షీణించి రూ.44.21 కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే మధ్యాహ్న సమయంలో తిరిగి పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 48.66 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎన్‌ఎస్ఈలో 20.62 కోట్ల షేర్లు చేతులు మారగా, బీఎస్ఈఇలో దాదాపు 3.57 కోట్ల షేర్లు చేతులు మారాయి.
ఊపు ఎందుకంటే..
విదర్భ ఇండస్ట్రీస్ పవర్‌కు రూ. 3,872 కోట్ల గ్యారెంటీని పూర్తిగా సెటిల్ చేసినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత ఆర్‌పవర్ షేర్లలో అప్‌ట్రెండ్ వచ్చింది. ఈ సెటిల్‌మెంట్ ఫలితంగా రూ. 3,872.04 కోట్ల బకాయి రుణానికి సంబంధించిన అన్ని కార్పొరేట్ గ్యారెంటీలు, అండర్‌టేకింగ్‌లు, ఆబ్లిగేషన్లు పరిష్కారమయ్యాయి. సీఎఫ్‌ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌తో కూడా అన్ని వివాదాలను రిలయన్స్ పవర్ పరిష్కరించుకుంది. అంతేకాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలన్నీ తీరిపోయినట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగింపు నాటికి సంస్థ ఏకీకృత నికర విలువ రూ.11,155 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
Comments
Please login to add a commentAdd a comment