Anil Ambani Son Wedding: Amitabh Bachchan Family Other Celebrities Attended Jai Anmol Ambani Marriage - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: ఘనంగా అనిల్‌ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్‌ ఫ్యామిలీ సందడి

Feb 22 2022 10:24 AM | Updated on Feb 22 2022 12:34 PM

Amitabh Bachchan Family Other Celebrities Attended Anil Ambani's Son Jai Anmol Wedding - Sakshi

అపర కుబేరులు అంబానీ ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ-టీనా అంబానిల పెద్ద కుమారుడు జై అన్మోల్‌ ప్రియురాలు క్రిషా షాతో ఏడడుగులు వేశాడు. ఆదివారం వీరి పెళ్లి వేడుక అంత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ వివాహ మహోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్‌ అంబానీ ఫ్యామిలీ, అమితాబ్‌ బచ్చన్ కుటుంబాలు సందడి చేశాయి. ఈ సందర్భంగా అన్మోల్‌-క్రిషాల పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ పెళ్లిలో అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లు షెర్వాని ధరించి కనిపించారు.

అలాగే అమితాబ్‌ కూతురు శ్వేతా బచ్చన్‌ నందా, ముఖేశ్‌ అంబానీ భార్య నితా అంబానీ, ఇషాతో పాటు ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, సోషల్‌ యాక్టివిస్ట్‌ పింకిరెడ్డిలు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాగా గతేడాది డిసెంబర్‌లో అన్మోల్‌, క్రిషాల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అన్మోల్ అంబానీ-క్రిషా షాల వెడ్డింగ్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలోని అంబానీ ఫ్యామిలీ హోమ్‌లో జరిగినట్టు సమాచారం.

కేవలం సన్నిహిత వర్గాలు, దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే వీరి వేడుకకు హాజరయ్యారు. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అన్మోల్, క్రిషాలతోపాటు, బచ్చన్ ఫ్యామిలీ, ముఖేశ్‌ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనలు పింకి రెడ్డి తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement