Anil Ambanis son
-
అట్టహాసంగా అనిల్ అంబానీ పెద్ద కుమారుడి వివాహం, ఫొటోలు వైరల్
-
ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి
అపర కుబేరులు అంబానీ ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. వ్యాపారవేత్త అనిల్ అంబానీ-టీనా అంబానిల పెద్ద కుమారుడు జై అన్మోల్ ప్రియురాలు క్రిషా షాతో ఏడడుగులు వేశాడు. ఆదివారం వీరి పెళ్లి వేడుక అంత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ మహోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ కుటుంబాలు సందడి చేశాయి. ఈ సందర్భంగా అన్మోల్-క్రిషాల పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ పెళ్లిలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు షెర్వాని ధరించి కనిపించారు. అలాగే అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ నందా, ముఖేశ్ అంబానీ భార్య నితా అంబానీ, ఇషాతో పాటు ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, సోషల్ యాక్టివిస్ట్ పింకిరెడ్డిలు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాగా గతేడాది డిసెంబర్లో అన్మోల్, క్రిషాల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అన్మోల్ అంబానీ-క్రిషా షాల వెడ్డింగ్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలోని అంబానీ ఫ్యామిలీ హోమ్‌లో జరిగినట్టు సమాచారం. View this post on Instagram A post shared by Pinky Reddy (@pinkyreddyofficial) కేవలం సన్నిహిత వర్గాలు, దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే వీరి వేడుకకు హాజరయ్యారు. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అన్మోల్, క్రిషాలతోపాటు, బచ్చన్ ఫ్యామిలీ, ముఖేశ్ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనలు పింకి రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆన్లైన్లో వైరలవుతోన్న అనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..!
అనిల్ అంబానీ, ముకేష్ అంబానీ అంటే? తెలియని వారు మన దేశంలో అతి తక్కువ మంది ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ అంబానీల ఇంట ఏ వేడుక జరిగిన అది దేశ మొత్తం తెలియాల్సిందే. 2018లో జరిగిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ - ఆనంద్ పిరమల్ వివాహం, 2019 ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల వివాహ వేడుకలే ఇందుకు ప్రతక్ష నిదర్శనం. ఇప్పుడు తాజాగా ఆ ఫ్యామిలీలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ - క్రిషాకు చెందిన ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. టీనా అంబానీ - అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ - క్రిషాల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన చిత్రాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సిపి)కి చెందిన ఎంపీ సుప్రియా సులే మొదట సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించిన క్రిషా - అన్మోల్ జంట బెస్ట్ జంటగా కనిపిస్తుంది. సుప్రియా సులే ఫోటోలను షేర్ చేసిన తర్వాత అంబానీ కుటుంబ సభ్యులు వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ గత ఏడాది డిసెంబర్ నెలలో నిశ్చితార్థం జరిగింది. అయితే, వీరి పెళ్లి ముహూర్తంపై అనిల్ అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే వీరి పెళ్లికి ముఖేష్ అంబానీ- నీతాతో పాటు వారి పిల్లలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Supriya Sule (@supriyasule) View this post on Instagram A post shared by Tina Ambani (@tinaambaniofficial) (చదవండి: గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్!) -
రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు
న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 24 ఏళ్ల ఈ యువ డైనమైట్ గత రెండేళ్లుగా రిలయన్స్ క్యాపిటల్‌లోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈయన యూకేలోని వర్విక్ బిజినెస్ స్కూల్ నుంచి డిగ్రీ పొందారు. ‘గత రెండేళ్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌లకు సంబంధించి చాలా నేర్చుకున్నాను. ఈ అనుభవంతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాను’ అని జై అన్మోల్ తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్.. లైఫ్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఫైనాన్స్, సెక్యూరిటీస్, జనరల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది.