Jai Anmol Ambani and Krisha Shah Pre Wedding Festivities Take the Internet by Storm - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో వైరలవుతోన్న అనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..!

Published Tue, Jan 25 2022 5:45 PM | Last Updated on Tue, Jan 25 2022 7:38 PM

Jai Anmol Ambani Krisha Shah Pre Wedding Festivities Take the Internet By Storm - Sakshi

అనిల్ అంబానీ, ముకేష్ అంబానీ అంటే? తెలియని వారు మన దేశంలో అతి తక్కువ మంది ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ అంబానీల ఇంట ఏ వేడుక జరిగిన అది దేశ మొత్తం తెలియాల్సిందే. 2018లో జరిగిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ - ఆనంద్ పిరమల్ వివాహం, 2019 ఆకాశ్‌ అంబానీ - శ్లోకా మెహతాల వివాహ వేడుకలే ఇందుకు ప్రతక్ష నిదర్శనం. ఇప్పుడు తాజాగా ఆ ఫ్యామిలీలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ - క్రిషాకు చెందిన ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

టీనా అంబానీ - అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ - క్రిషాల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన చిత్రాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సిపి)కి చెందిన ఎంపీ సుప్రియా సులే మొదట సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించిన క్రిషా - అన్మోల్ జంట బెస్ట్ జంటగా కనిపిస్తుంది. సుప్రియా సులే ఫోటోలను షేర్ చేసిన తర్వాత అంబానీ కుటుంబ సభ్యులు వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ గత ఏడాది డిసెంబర్ నెలలో నిశ్చితార్థం జరిగింది. అయితే, వీరి పెళ్లి ముహూర్తంపై అనిల్ అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే వీరి పెళ్లికి  ముఖేష్ అంబానీ- నీతాతో పాటు వారి పిల్లలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

(చదవండి: గో ఫస్ట్ ఎయిర్ లైన్స్​ బంపర్ ఆఫర్.. రూ.926కే విమాన టికెట్​!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement