రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు | Anil Ambani's elder son Jai Anmol joins Reliance Capital board | Sakshi
Sakshi News home page

రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు

Published Wed, Aug 24 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు

రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు

న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 24 ఏళ్ల ఈ యువ డైనమైట్ గత రెండేళ్లుగా రిలయన్స్ క్యాపిటల్‌లోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఈయన యూకేలోని వర్విక్ బిజినెస్ స్కూల్ నుంచి డిగ్రీ పొందారు. ‘గత రెండేళ్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌లకు సంబంధించి చాలా నేర్చుకున్నాను. ఈ అనుభవంతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాను’ అని జై అన్మోల్ తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్.. లైఫ్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఫైనాన్స్, సెక్యూరిటీస్, జనరల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement