రిలయన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అధినేత అనిల్ అంబానీ గ్రూప్‌కి భారీ ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) పై చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం సాధించారు. కోల్‌కత్తా హైకోర్టు డీవీసీ మధ్యవర్తిత్వం కింద అనిల్ అంబానీకి రూ.405 కోట్లు, బ్యాంక్ గ్యారెంటీ కింద రూ.354 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా అనిల్ అంబానీ రూ.1,354 కోట్లను దక్కించుకోనున్నారు.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే
10 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ వెస్ట్ బెంగాల్‌లోని రఘునాథ్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3,750 కోట్లతో థర్మల్ వపర్ ప్రాజెక్ట్ నిర్మించే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. అయితే, అన్వేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పట్టాలెక్కలేదు. దీనిపై ప్రభుత్వ సంస్థ అభ్యంతరం తెలిపింది. నష్టపరిహారం కింద తమకు కొంత చెల్లించాలని కోరింది.
కోర్టు మెట్లెక్కిన అనిల్ అంబానీ
దీంతో అనిల్ అంబానీ కోర్టు మెట్లెక్కారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు సంస్థపై న్యాయపోరాటానికి దిగారు. ఈ అంశంపై పలు దఫాలుగా కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కోల్‌కత్తా హైకోర్టు అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పిచ్చింది. తక్షణమే డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్‌కు రూ.405 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బ్యాంకు గ్యారెంటీ కింద మరో రూ.354 కోట్లు. మొత్తం రూ. 1,354 కోట్లు అనిల్ అంబానీ పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment