Reliance Infrastructure Company
-
అనిల్ అంబానీకి అనుకూలంగా.. గెలుపు నాదే!
రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ అధినేత అనిల్ అంబానీ గ్రూప్‌కి భారీ ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) పై చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం సాధించారు. కోల్కత్తా హైకోర్టు డీవీసీ మధ్యవర్తిత్వం కింద అనిల్ అంబానీకి రూ.405 కోట్లు, బ్యాంక్ గ్యారెంటీ కింద రూ.354 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా అనిల్ అంబానీ రూ.1,354 కోట్లను దక్కించుకోనున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే 10 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ వెస్ట్ బెంగాల్‌లోని రఘునాథ్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3,750 కోట్లతో థర్మల్ వపర్ ప్రాజెక్ట్ నిర్మించే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. అయితే, అన్వేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పట్టాలెక్కలేదు. దీనిపై ప్రభుత్వ సంస్థ అభ్యంతరం తెలిపింది. నష్టపరిహారం కింద తమకు కొంత చెల్లించాలని కోరింది. కోర్టు మెట్లెక్కిన అనిల్ అంబానీ దీంతో అనిల్ అంబానీ కోర్టు మెట్లెక్కారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు సంస్థపై న్యాయపోరాటానికి దిగారు. ఈ అంశంపై పలు దఫాలుగా కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కోల్కత్తా హైకోర్టు అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పిచ్చింది. తక్షణమే డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్కు రూ.405 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బ్యాంకు గ్యారెంటీ కింద మరో రూ.354 కోట్లు. మొత్తం రూ. 1,354 కోట్లు అనిల్ అంబానీ పొందనున్నారు. -
అదానీ చేతికి రిలయన్స్ ఇన్ఫ్రా ట్రాన్స్ మిషన్
డీల్ విలువ రూ.2,000 కోట్లు న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ విద్యుత్ ప్రసార వ్యాపారాన్ని అదానీ గ్రూప్‌కు విక్రయించనున్నది. ఈ వ్యాపారంలో వంద శాతం వాటాను అదాని ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు విక్రయించనున్నామని రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై బుధవారం సంతకాలు జరిగాయనిపేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించకపోయినప్పటికీ, ఈ డీల్ విలువ రూ.2,000 కోట్లకు మించి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ డీల్ కారణంగా అదానీ ట్రాన్స్మిషన్కు 10వేల సర్క్యూట్ కిమీ. పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజె క్ట్స్ చేతిలో ఉంటాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. రిలయన్స్ ఇన్ఫ్రా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటకల్లో వెస్టర్న్ రీజియన్ సిస్టమ్ స్ట్రెంగ్తెనింగ్ స్కీమ్(డబ్ల్యూర్ఎస్ఎస్ఎస్), బీ అండ్ సీ ప్రాజెక్ట్స్ కింద విద్యుత్ ప్రసార వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పర్బతి కొల్డమ్ ట్రాన్స్మిషన్ కంపెనీ(పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌వెంచర్)లో 74 శాతం వాటా ఉంది. ఈ మూడు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, ఇప్పుడు ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల్లో వంద శాతం వాటాను అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయిం చింది. కాగా ఈ వ్యాపార విక్రయ లావాదేవీకి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. ఈ లావాదేవీ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కానున్నదని అంచనా.